రావల్పిండిలో భారీ పేలుడు… మసూద్ అజార్ మృతి..?

రావల్పిండిలో భారీ పేలుడు… మసూద్ అజార్ మృతి..?

పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి, జైష్ ఎ మహ్మద్ సుప్రీమ్, మసూద్ అజార్ చనిపోయాడా…. ఔననే అంటోంది ట్విట్టర్. పాకిస్థాన్ లోని చాలామంది ట్విట్టర్ యూజర్స్ నిన్నా, ఇవాళ ఇదే విషయాన్ని చెబుతున్నారు. యూఎన్ఓ బ్లాక్ లిస్ట్ లో ఉన్న ఈ టెర్రరిస్ట్ నాయకుడు … రావల్పిండిలో జరిగిన పేలుడులో చనిపోయాడంటున్నారు. ఐతే.. దీనిపై అధికారికంగా మాత్రం ప్రకటన రావాల్సి ఉంది.

రావల్పిండిలోని మిలటరీ ఎమిరేట్ హాస్పిటల్ లో ఆదివారం భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడు పాకిస్థాన్ లో సంచలనం రేపుతోంది. కిడ్నీ ఫెయిల్యూర్ తో బాధపడుతూ మౌలానా మసూద్ అజార్ .. ఇదే హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడని పాకిస్థానీలు ట్విట్టర్ లో చెబుతున్నారు. ఈ పేలుడులో 10 మంది గాయపడ్డారనీ.. వారిలో మసూద్ అజార్ కూడా ఉన్నాడని కొందరంటున్నారు. గాయపడిన అతడికి చికిత్స కొనసాగుతోందని కొందరంటే.. ఈ పేలుడులో అతడి చనిపోయాడని మరికొందరు అంటున్నారు.

బ్లాస్ట్ జరిగిన ప్రాంతంలోకి మీడియాను, వేరే మనుషులనూ ఎవరినీ అనుమతించడంలేదని.. అక్కడ బందోబస్తు పెంచినట్టు పాకిస్థానీలు ట్విట్టర్ లో చెబుతున్నారు.

మసూద్ అజార్ ను ఐక్యరాజ్యసమితి బ్లాక్ లిస్టులో పెట్టడం… భారత్ సహా అగ్రదేశాలు… అతడిని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా ముద్రవేయడంతో.. అంతర్జాతీయ వ్యవహారాల్లో పాకిస్థాన్ ఇబ్బందిపడుతోందనీ.. సొంత దేశంలోనూ విభజనకు కారణమవుతున్నాడన్న కారణంతో ఈ దాడి జరిపించి ఉండొచ్చని కొందరు అంటున్నారు.