యాదాద్రి జిల్లాలో రెండు తలల గొర్రె పిల్ల జననం

యాదాద్రి జిల్లాలో రెండు తలల గొర్రె పిల్ల జననం

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో ఓ గొర్రె రెండు తలల పిల్లకు జన్మనిచ్చింది. జిల్లాలోని వలిగొండ మండలం రెడ్ల రేపాకకు చెందిన గొర్రెల కాపరి నోముల వెంకటేశ్​ మందలోని ఓ గొర్రె మంగళవారం రెండు తలల గొర్రె పిల్లకు జన్మనిచ్చింది. తల తప్ప.. ఆ గొర్రె పిల్ల ఆకారం మిగిలిన గొర్రెల మాదిరిగానే ఉంది. 

ఈ గొర్రె పిల్లను చూసేందుకు స్థానికులు తరలివచ్చారు. ఈ విషయమై ఇన్​చార్జి వెటర్నరీ ఆఫీసర్ ​డాక్టర్ మోతీలాల్ ను వెలుగు విలేకరి వివరణ కోరగా.. జన్యుపరమైన లోపాల వల్ల రెండు తలలు లేదా ఆరు కాళ్లతో గొర్రె పిల్లలు జన్మిస్తాయని తెలిపారు. గర్భాశయంలో పిండాలు అభివృద్ధి చెందే సమయంలో తలలు సరిగ్గా వేరుపడకపోవడం వల్ల ఇలా జరుగుతుందని వివరించారు.