
ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో మహిళను చంపే ప్రయత్నం చేశారు ఇద్దరు దుండగులు. ఒకరు మాట్లాడుతుండగా మరొకరు గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో మంగళవారం (అక్టోబర్ 07) మహిళలపై హత్యాయత్నానికి పాల్పడ్డారు ఇద్దరు దుండగులు. దుండగులు చంపేందుకు ప్రయత్నించగా బాధితురాలు గీత ప్రతిఘటించి కేకలు వేసింది. వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు నిందితుల్లో ఒకరిని పట్టుకుని దేహశుద్ధి చేశారు.
గీత ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో సిరిసిల్లకు చెందిన దుండగులు గాజుల మల్లేశం, మరో వ్యక్తి ఈ కుట్రకు పాల్పడ్డారు. ఆమెతో ఒకరు మాట్లాడుతుండగా, మరొకరు గొంతు నులిమి పట్టుకున్నారు. ఆమె గట్టిగా అరిచి తప్పించుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.