కాంగ్రెస్​ బిల్లుకు బీజేపీ సపోర్ట్

కాంగ్రెస్​ బిల్లుకు బీజేపీ సపోర్ట్

భోపాల్: కర్నాటకలో కుమార సర్కారు కూలిపోయింది, పగ్గాలు చేపట్టడమే ఆలస్యమని సంతోషంగా ఉన్న బీజేపీకి మధ్యప్రదేశ్​లో షాక్​తగిలింది. ఆ పార్టీ నేతలిద్దరు కాంగ్రెస్​సర్కారుకు అనుకూలంగా వ్యవహరించడంతో ఆందోళనలో పడింది. మధ్యప్రదేశ్​అసెంబ్లీలో సర్కారు బుధవారం ప్రవేశపెట్టిన ఓ కీలక బిల్లుకు బీజేపీ లీడర్లు ఇద్దరు అనుకూలంగా ఓటేశారు. రాష్ట్రంలోని లాయర్లు డిమాండ్​చేస్తున్న ‘అడ్వొకేట్​ప్రొటక్షన్​యాక్ట్​బిల్’ను బుధవారం కమల్​నాథ్​సర్కారు అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. నిజానికి బిల్లును పదిహేనేళ్ల క్రితమే రూపొందించినా.. అప్పటి బీజేపీ సర్కారు పట్టించుకోలేదు. 3 టర్మ్​లు రాష్ట్రాన్ని పాలించినా బిల్లుకు మోక్షం లభించలేదు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్లుగానే ప్రభుత్వం ఏర్పడ్డాక కాంగ్రెస్​ఈ బిల్లును కదిలించింది. బుధవారం ప్రవేశపెట్టింది. దీనికి కాంగ్రెస్​తో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు శరద్​కోల్, నారాయణ్​త్రిపాఠీ ఓటేశారు. అంతకుముందు బీజేపీ సీనియర్​లీడర్, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత గోపాల్​భార్గవ మాట్లాడుతూ.. మా బాస్​(పార్టీ హైకమాండ్)  ఊ అన్నాడంటే మీరు 24 గంటలు కూడా అధికారంలో ఉండరంటూ కమల్​నాథ్​ను ఉద్దేశించి కామెంట్​చేశారు. దీనికి జవాబుగా ‘మీ బాస్​కాస్త సెన్సిబుల్​కాబట్టే అలాంటి ఆదేశాలివ్వడంలేదు. కానీ మీరలా కాదు కదా, అవిశ్వాస తీర్మానం పెడతానంటే మిమ్మల్ని అడ్డుకునే వాళ్లెవరూ లేరిక్కడ’ అని సీఎం కమల్​నాథ్​ అన్నారు.