పుట్టిన 48 గంటల్లో.. రూ.52 కోట్ల ఆస్తి

పుట్టిన 48 గంటల్లో.. రూ.52 కోట్ల ఆస్తి

కొందరు కోటీశ్వరులు అవడానికి జీవితకాలం కూడా సరిపోదు. మరి కొందరు పుట్టుకతో కోటీశ్వరులు అవుతారు. అలా ఓ బేబీ పుట్టుకతోనే కోటీశ్వరాలిగా మారింది.  కేవలం పుట్టిన రెండు రోజుల్లోనే కోట్ల విలువైన ఆస్తిని దక్కించుకుంది. 

రెండు రోజుల బేబీకి రూ. 52 కోట్ల ఆస్తి..

 బారీ డ్రివిట్-బార్లో అనే మల్టీ-మిలియనీర్  కుమార్తె సాఫ్రాన్ డ్రివిట్-బార్లో (23) జూన్ 24వ తేదీన శనివారం తన ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా బారీ డ్రివిట్ బార్లో సంతోషం వ్యక్తం చేస్తూ  ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశాడు.  "నా కూతురు  ఈ రోజు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. "మా కుటుంబం కోసం ఈ అందమైన యువరాణిని ఇచ్చినందుకు టోనీ డ్రివిట్-బార్లో,కోనార్ టక్కర్ కు ధన్యవాదాలు చెబుతున్నాను..ఇది గర్వించదగ్గ విషయం అని  అని 51 ఏళ్ల బారీ డ్రివిట్ బార్లో తెలిపాడు.

భారీ భవంతి గిఫ్ట్..

బారీ డ్రివిట్-బార్లో అనే మల్టీ-మిలియనీర్  రెండు రోజుల తన మనవరాలికి రూ.10.44 విలువైన ఇంటిని బహుమతిగా ఇచ్చాడు. అంతేకాదు తన ట్రస్ట్ ఫండ్‌లో శిశువు పేరిట రూ. 52 కోట్లు కేటాయించాడు. తన మనవరాలి కోసం కొన్ని కొత్త ఇంటిలో ప్రత్యేకమైన ఇంటీరియర్ డిజైన్ చేయిస్తున్నాడు.