
- సూపరింటెండెంట్ సస్పెన్షన్ కు రికమెండ్
- డ్యూటీకి రాని జీడీఎంవోను విధుల నుంచి తప్పిస్తూ..మరో ముగ్గురు సిబ్బందికి మెమోలు జారీ
- పసికందు మృతి ఘటనపై డీఎంహెచ్ వో ఆధ్వర్యంలో కమిటీ ఎంక్వైరీ
పాలకుర్తి, వెలుగు : జనగామ జిల్లా పాలకుర్తి ప్రభుత్వ ఆస్పత్రి ఘటనపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. విచారణ కమిటీ నివేదికతో ఇద్దరు డాక్టర్లను సస్పెండ్ చేశారు. మరో నలుగురు వైద్య సిబ్బందిపై తీవ్ర చర్యలు తీసుకున్నారు. ఆస్పత్రిలో బుధవారం పసికందు మృతి చెందగా, ఘటనపై విచారించేందుకు కలెక్టర్షేక్ రిజ్వాన్ బాషా.. డీఎంహెచ్ఓ మల్లికార్జున్ఆధ్వర్వంలో మరో నలుగురితో విచారణ కమిటీని నియమించగా.. గురువారం ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. గర్భంలోనే శిశువు మృతిచెందడంపై బాలింత అర్చనను, బంధువులను అడిగి తెలుసుకున్నారు.
వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై ఆరా తీశారు. టైమ్ కు గర్భిణి అర్చనను మెరుగైన వైద్యానికి రెఫర్ చేయకుండా నిర్లక్ష్యం చేసిన గైనకాలజిస్ట్అపర్ణను సస్పెన్షన్, రెండు రోజులుగా డ్యూటీకి రాని సూపరింటెండెంట్డాక్టర్ పరమేశ్వరి సస్పెన్షన్ కు రికమెండ్ చేస్తూ వైద్య విధాన పరిషత్కమిషనర్కు లెటర్పంపారు. ఐదురోజులుగా డ్యూటీకి రాని జీడీఎంవో డాక్టర్ భరత్‌ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరితో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్వప్న, బాధిత మహిళతో అమర్యాదగా వ్యవహరించిన స్టాఫ్నర్స్జె. నీల, కె. కృష్ణవేణికి మెమో జారీ చేశారు.