మార్చి 15లోపు కేంద్ర ఎన్నికల కమిషన్‫లో ఇద్దరు కొత్త కమిషనర్లు

మార్చి 15లోపు  కేంద్ర ఎన్నికల కమిషన్‫లో ఇద్దరు కొత్త కమిషనర్లు

ఎలక్షన్ కమిషనర్ గా ఉన్న  అరుణ్ గోయల్ అకస్మాత్తుగా రాజీనామా చేశారు. మరో ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే అంతకు ముందే 65 ఏళ్లు పూర్తి చేసుకొని పదవీ విరమణ పొందారు. కేంద్ర ఎన్నికల సంఘం ఫ్యానల్ లో  ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్ తోపాటు మరొ ఇద్దరు కమిషనర్లు ఉంటారు. ప్రస్తుతం ఛీఫ్ ఎలక్షన్ కమిషన్  రాజీవ్ కుమార్ మాత్రమే ఉన్నారు. మిగిలిన  రెండు కమిషనర్ల పదవులు ఖాళీగా ఉన్నాయి. లోక్ సభ ఎన్నికలకు కొన్ని నెలలు మాత్రమే ట్రైం ఉండటంతో త్వరగా ఎలక్షన్ కమిషనర్లను నియమించాల్సి ఉంది.

ALSO READ :- Vande Bharat sleeper trains: గుడ్ న్యూస్..వందేభారత్ స్లీపర్ ట్రైన్స్ వచ్చేస్తున్నాయోచ్..

 ఈనేపథ్యంలో మార్చి 15నాటికి ఇద్దరు కొత్త ఎన్నికల కమిషనర్లను నియమించనున్నారని సమాచారం. సెర్చ్ కమిటీ ఇప్పటికే ఐదుగురి పేర్లను సెలక్షన్ కమిటీకి సూచించింది. ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రి, లోక్ సభ ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరితో కూడిన సెలక్షన్ కమిటీ 5పేర్లను పరిశీలించి అందులో ఇద్దరిని అమోదిస్తారు. తర్వాత రాష్ట్రపతి అధికారికంగా నియామకం చేస్తారు. మార్చి 13, 14 తేదీల్లో సెలక్షన్ కమిటీ సమావేశం కానుంది. దీంతో మర్చి 15న ఇద్దరి ఎలక్షన్ కమిషనర్లు నియామకం కావొచ్చు.