ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఉద్యోగులు

ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఉద్యోగులు

ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు. ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం పంచాయితీ సెక్రటిరీని అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇంటి నిర్మాణ అనుమతుల కోసం పంచాితీ సెక్రటరీ మహబూబ్ పాషా రూ. 6వేలు లంచం అడిగాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. పంచాయితీ కార్యాలయం పాషా ఆ డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతన్ని పట్టుకున్నారు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా ఎయింప్లాయింట్ ఆఫీసులో ఏసీబీ దాడులు జరిగాయి. ఓ వ్యక్తి నుంచి రూ. 2 లక్షల లంచం తీసుకుంటూ  ఆఫీసర్ కిరణ్ పట్టుబడ్డాడు. రెండు ఘటనలకు సంబంధించి కేసులు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.