వీడియో: క్షణాల్లో వరదలో కొట్టుకుపోయిన రెండంతస్థుల మేడ

వీడియో: క్షణాల్లో వరదలో కొట్టుకుపోయిన రెండంతస్థుల మేడ

వర్షం ధాటికి ఓ రెండంతస్థుల బిల్డింగ్ డ్రైనేజీలోకి కొట్టుకొనిపోయిన ఘటన ఆదివారం ఉదయం ఢిల్లీలో జరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొన్ని ప్రధాన రోడ్లపై భారీఎత్తున నీరు నిలిచిపోయింది. మింటో బ్రిడ్జ్‌ వద్ద భారీగా నీరు చేరడంతో ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌కు చెందిన ఓ బస్సు మునిగిపోయింది. దీంతో అందులో ఉన్న ప్రయాణికులను అగ్నిమాక శాఖ సిబ్బంది రక్షించారు. అదే ప్రాంతంలో నీటిలో కొట్టుకుపోత్తున్న ఓ మృతదేహాన్ని గుర్తించారు.

అన్నా నగర్ ప్రాంతంలోని ఐటీవో రింగ్ రోడ్డు సమీపంతో డ్రైనేజీ పక్కనే కట్టిన ఇళ్లు వర్షం ధాటికి డ్రైనేజీలోకి కొట్టుకొనిపోయాయి. అందరూ చూస్తుండగానే.. క్షణాల్లో ఓ రెండంతస్తుల మేడ నీటిలోకి కొట్టుకుపోయింది. ఆ ఇంట్లో ఎవరైనా ఉన్నారా అనే విషయం ఇంకా తెలియలేదు. డ్రైనేజీలోకి వర్షపు నీరు పోవడాన్ని చూస్తున్న కొంతమంది.. ఆ ఇల్లు కూలేలా ఉందని.. ఇంట్లో వాళ్లని బయటకు వెళ్లాలని హెచ్చరిస్తున్న మాటలు కూడా వీడియోలో వినపడుతున్నాయి.

ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా వానలు కురిసినట్లు వాతావరణ విభాగం వెల్లడించింది. ఉదయం 8.30 గంటల వరకు 74.8 మి.మీ. వర్షపాతం నమోదయ్యిందని సఫ్దర్‌గంజ్‌ అబ్జర్వేటరీ ప్రకటించింది. ఢిల్లీతోపాటు అదంపూర్‌, హిస్సార్‌, హన్సీ, జింద్‌, గోహానా, గన్నౌర్‌, బారుట్‌, రోహ్‌తక్‌, సోనిపట్‌, బాగ్‌పాట్‌, గుర్‌గావ్‌, నోయిడా, ఘజియాబాద్‌, ఫరీదాబాద్‌లో భారీ వర్షం కురిసింది.

For More News..

కరోనా నుంచి కోలుకున్నవారితో వాట్సాప్ గ్రూప్..

24 గంటల్లో 38,902 కరోనా కేసులు