ఒకేరోజు ఇద్దరు మాజీ క్రికెటర్ల కన్నుమూత

ఒకేరోజు ఇద్దరు మాజీ క్రికెటర్ల కన్నుమూత

ఒకేరోజు ఇద్దరు మాజీ క్రికెటర్లు గుండెపోటుతో మృతిచెందడటంతో క్రికెట్ ఆస్ట్రేలియా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అద్భుతమైన ఆట తీరుతో క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించిన ఇద్దరు గొప్ప ఆటగాళ్లు ఒకేరోజు.. ఒకే తీరుగా హఠాన్మరణం చెందడం క్రికెట్ ఫ్యాన్స్ ను తీవ్రంగా కలచివేసింది.

రాడ్ మార్ష్ ( వికెట్ కీపర్)

దిగ్గజ ఆటగాడు, ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ రాడ్ మార్ష్ (74)కు వారం కిందట గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు. వారం రోజులుగా చికిత్స పొందుతున్న రాడ్ మార్ష్.. ఈ రోజు తుది శ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల పలువురు క్రికెటర్లు, అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు. 

ప్ర‌పంచంలోని అత్యుత్త‌మ వికెట్ కీప‌ర్లలో మార్ష్ ఒక‌రు. 1970 నుంచి 1984 మ‌ధ్య కాలంలో ఇంటర్నేషనల్  క్రికెట్‌లో మార్ష్ ఆడారు. కెరీర్‌లో రాడ్ మార్ష్ 96 టెస్టు మ్యాచ్‌లు, 92 వ‌న్డే మ్యాచ్‌లు ఆడారు. ఈ క్ర‌మంలో అనేక రికార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకున్నారు. 

షేన్‌వార్న్ (స్పిన్ మాంత్రికుడు)

ఆస్ట్రేలియా క్రికెట్‌కు ఎంతో వ‌న్నెతెచ్చిన అద్భుత స్పిన్న‌ర్ షేన్ వార్న్(52) గుండెపోటుతో చ‌నిపోయిన‌ట్టు ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ తెలిపింది. థాయ్‌లాండ్‌లో ఉన్న ఆయనకు శుక్రవారం గుండెపోటు రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వార్న్ చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

ఆస్ట్రేలియా తరపున షేన్‌వార్న్ మొత్తం 145 టెస్టులు ఆడి.. 708 వికెట్లు తీసి రికార్డు సృష్టించారు. అలాగే 194 వన్డేలాడి.. 293 వికెట్లు పడగొట్టారు. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కు కెప్టెన్ గా కూడా వార్న్ వ్యవహరించారు. వార్న్ మృతి పట్ల ఆస్ట్రేలియాతో పాటు పలు దేశాల పలు క్రికెటర్లు, అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం..

ఐసీసీ ర్యాంకింగ్స్: టాప్‌ 10 నుంచి కోహ్లీ, రోహిత్‌ ఔట్‌