మహబూబ్​నగర్​ హోం నుంచి ఇద్దరు అమ్మాయిల మిస్సింగ్

మహబూబ్​నగర్​ హోం నుంచి ఇద్దరు అమ్మాయిల మిస్సింగ్

మహబూబ్ నగర్ రూరల్​, వెలుగు : మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ చిల్డ్రన్​ హోమ్ లో ఉంటున్న ఇద్దరు అమ్మాయిలు కనిపించకుండాపోయారు. ఈ విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది. రూరల్ ఎస్సై విజయ్ కుమార్ కథనం ప్రకారం..జిల్లా సంక్షేమ అధికారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చిల్డ్రన్స్ హోమ్ లో అనాథలైన అడ్డాకుల మండల కేంద్రానికి చెందిన మానస(17), జడ్చర్లకు చెందిన అక్షిత (17) కొద్ది రోజులుగా ఆశ్రయం పొందుతున్నారు.

 వీరు సోమవారం అర్ధరాత్రి నుంచి కనిపించకుండా పోయారని హోమ్ ఇన్​చార్జి యాదమ్మ ఫిర్యాదు చేశారు. మిస్సయిన వారి కోసం వెతుకుతున్నట్టు పోలీసులు చెప్పారు.