హైదరాబాద్లో గోవా లిక్కర్ విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్​

హైదరాబాద్లో గోవా లిక్కర్ విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్​

గోవా లిక్కర్ను హైదరాబాద్లో విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 128 గోవా లిక్కర్​ బాటిళ్లను, మద్యాన్ని తరలించేందుకు వినియోగించిన జింగ్ ట్రావెల్స్ బస్సు (AP 39 TE 5555)ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిని కర్ణాటకకు చెందిన మస్తాన్ సాబ్, ఖదీర్లుగా గుర్తించారు.

వీరిద్దరు గోవా నుంచి మద్యం తెచ్చి నగరంలో విక్రయిస్తున్నారని వెల్లడైంది. పక్కా సమాచారంతో మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద హైవే పై ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా మద్యం బాటిళ్లతో మస్తాన్​, ఖదీర్​ లు దొరికిపోయారు.