ఇండియన్ల తలలు తెగనరికిన సౌదీ

ఇండియన్ల తలలు తెగనరికిన సౌదీ
  • తోటి ఇండియన్ ను హత్య చేయడంతో ఇద్దరికి మరణ శిక్ష
  • ధ్రువీకరించిన విదేశాంగ శాఖ..
  • మృతుడి భార్య పిటిషన్ తో వెలుగులోకి
  • మృతదేహాలూ ఇళ్లకు చేరనివ్వని కఠినమైన సౌదీ చట్టాలు

సౌదీ అరేబియాలో చట్టాలు, శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ ఇద్దరు ఇండియన్ల విషయంలో అది మరోసారి రుజువైంది. తోటి ఇండియన్ ను చంపినందుకు ఫిబ్రవరి 28న ఆ ఇద్దరిని తలలు తెగనరికి చంపేసింది ఆ దేశ ప్రభుత్వం. పంజాబ్ లోని హోషియార్ పూర్ కు చెందిన సత్వీందర్ కుమార్ , లూధియానాకు చెందిన హర్జీత్ సింగ్ అనే వ్యక్తులకు అంత కఠినమైన శిక్షను విధించింది.శిక్షను అమలు  చేసేటప్పుడు కనీసం ఆ విషయాన్నిరియాద్ లోని ఇండియన్ ఎంబసీకి కూడా చెప్పలేదు.ఈ మరణ శిక్ష విషయాన్ని దేశ విదేశాంగ శాఖ ధ్రువీకరిం చింది. అక్కడి నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి కాబట్టి.. ఆ ఇద్దరి మృతదేహాలు వారి కుటుంబ సభ్యులకు చేరే అవకాశాల్లేవు. చోరీ చేసిన డబ్బుపై గొడవ జరగడంతో ఆరిఫ్ ఇమాముద్దీన్ అనే తోటి వ్యక్తిని సత్వీందర్ , హర్జీత్ సింగ్ చంపేశారు.కొన్ని రోజుల తర్వాత ఆ ఇద్దరు మందు తాగి గొడవ చేస్తుండడంతో పోలీసులు అరెస్ట్​ చేశారు. వారిని తిరిగి ఇండియాకు పంపించే పనిలో ఉన్న అధికారులకు..ఇమాముద్దీన్ హత్య వ్యవహారం తెలిసింది. మరణశిక్ష వరకు దారి తీసింది.

సత్వీందర్ భార్య పిటిషన్ తో..

భర్త ఆచూకీ ఎంతకీ తెలియకపోవడంతో సత్వీం దర్ భార్య సీమా రాణి విదేశాంగ శాఖకు పిటిషన్ పెట్టుకుంది. ఈ మరణ శిక్షకు సంబంధించిన విషయాన్నిసోమవారమే లెటర్ ద్వారా సీమారాణికి తెలియజేసింది ప్రభుత్వం. ఇమాముద్దీన్ అనే వ్యక్తిని చంపినందుకుగానూ సత్వీందర్ , హర్జీత్ ను 2015 డిసెంబర్ 9న అరెస్ట్​ చేశారని పేర్కొంది. విచారణ నిమిత్తం రియాద్ జైలుకు తరలించారని, అక్కడ వారు తమ నేరాన్నిఒప్పుకున్నారని వివరిం చింది. 2017 మే 31న వారి కేసు విచారణకు ఎంబసీ అధికారి వెళ్లారని, అప్పీల్స్ కోర్టుకు కేసు ఫైలును ట్రాన్స్ ఫర్ చేశారని చెప్పింది. హిరాభా (దారిదోపిడి– దానికీ అక్కడ మరణశిక్షే)చార్జ్​తో ఫైలును పంపారని పేర్కొంది. ఎప్పటికప్పుడు కేసు విచారణ పురోగతిని తెలుసుకునేందుకు ఎంబసీ అధికారులు జైలుకు వెళ్లేవారని వివరించారు. కానీ,ఎంబసీ అధికారులకు సమాచారం ఇవ్వకుండానే ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇద్దరికీ తలలు తెగనరికి మరణశిక్షను అమలు చేశారని వివరించింది. వారి మృతదేహాలను ఇండియాకు రప్పించేం దుకు సౌదీ అరేబియా ప్రభుత్వం, ఆ దేశ విదేశాంగ శాఖతో మాట్లాడినా, అక్కడి చట్టాల వల్ల అది కుదరట్లేదని ఆ లేఖలో పేర్కొంది.