రెండు నెలలు భారీ సినిమాలు.. సినిమా లవర్స్కు ఫుల్ పండుగ

రెండు నెలలు భారీ సినిమాలు.. సినిమా లవర్స్కు ఫుల్ పండుగ

సినిమా లవర్స్ కు గుడ్ న్యూస్. ఒకటి కాదు రెండు కాదు.. రెండు నెలల పాటు మొత్తం పెద్ద సినిమాల రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. అందులో కొన్ని రీజనల్ సినిమాలైతే కొన్ని పాన్ ఇండియా సినిమాలు. అంతేకాదు.. ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న ప్రెస్టీజియస్ మూవీస్ కూడా ఉన్నాయి. 

అందులో ముందుగా వస్తున్న హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun tej) గాండీవధారి అర్జున(Gandeevadhari Arjuna). ప్రవీణ్ సత్తారు(Pravin sattaru) డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజు యంగ్ హీరో కార్తికేయ గుమ్మికొండ(Karthikeya gummikonda) చేస్తున్న బెదురులంక 2012(Bedurulanka 2012) రిలీజ్ కానుంది. 

ఆతరువాత సెప్టెంబర్ 1న విజయ్ దేవరకొండ(Vijay devarakonda), సమంత(Samantha) జంటగా వస్తున్న ఖుషి(Khushi) సినిమా రిలీజ్ కానుంది. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. సెప్టెంబర్ 7న బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా వస్తున్న భారీ మూవీ జవాన్(Jawan) రిలీజ్ కానుంది. అట్లీ కుమార్(Atlee kumar) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఆతరువాత ఉస్తాద్ హీరో రామ్ పోతినేని(Ram pothineni), మాస్ దర్శకుడు బోయపాటి(Boyapati srinu) కాంబోలో వస్తున్న పాన్ ఇండియా మూవీ స్కంద(Skanda) మూవీ సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సెప్టెంబర్ 28 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) అండ్ ప్రశాంత్ నీల్(Prashanth neel) కాంబోలో వస్తున్న సలార్(Salaar) రిలీజ్ కానుంది. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటైన ఈ సినిమా కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

ఇక అక్టోబర్ లో కూడా తెలుగు తమిళ్ నుండి భారీ సినిమాలి క్యూ కడుతున్నాయి. అందులో ముందుగా తెలుగులో బాలకృష్ణ(Balakrishna) హీరోగా వస్తున్న భగవంత్ కేసరి(Bhagavanth kesari) రిలీజ్ కు రెడీగా ఉంది. అనిల్ రావిపూడి(Anil ravipudi) దర్శకత్వంలో వస్తున్న ఈ అవుట్ అండ్ అవుట్ మాస్ మూవీ అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజు తమిళ్ లో విజయ్ తలపతి(Vijay thalapathy), లోకేష్ కానగరాజ్(Lokesh kanagaaraj) కాంబోలో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ లియో(Leo) రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.  ఇక అక్టోబర్  20న మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) హీరోగా వస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వర రావు(Tiger nageswara rao) రిలీజ్ కానుంది. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. మరి ఈ సినిమాల్లో ప్రేక్షకులు ఏ సినిమాను హిట్ చేస్తారో ఏ సినిమాను ఫట్ చేస్తారో చూడాలి