- నాగర్కర్నూల్ జిల్లా సర్వాయికుంటలో ఘటన
లింగాల, వెలుగు : నాగర్ కర్నూల్జిల్లా లింగాల మండల పరిధిలోని అవుసలికుంట శివారులోని సర్వా కుంట సమీపంలోని ఓ పొలంలో కట్టేసిన పెంపుడు కుక్కలపై హైనా దాడి చేసి చంపేసింది. అవుసలికుంటకు చెందిన భోయ బాలస్వామి తన రెండు పెంపుడు కుక్కలను సోమవారం రాత్రి పొలంలో కట్టేసి ఇంటికి వెళ్లిపోయాడు. మంగళవారం వెళ్లి చూసేసరికి రెండు కుక్కలను ఏదో జంతువు చంపినట్టు గుర్తించాడు. అయితే, కుక్కలను చిరుతపులే చంపిందనే వార్త మండల వ్యాప్తంగా వ్యాపించడంతో స్థానిక రైతులు, ప్రజలు భయపడి ఇండ్లలోంచి బయటకు రావడానికి భయపడ్డారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి పాదముద్రలను పరిశీలించారు. చివరకి చంపింది హైనా అని తేల్చారు.
