నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: గుప్త నిధుల పేరిట మోసగించిన ఇద్దరు మహిళలను నాగర్ కర్నూల్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ బుధవారం మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు. తాడూరు మండలం అంతారం గ్రామానికి చెందిన అత్తిలి అనిత, వికారాబాద్ కు చెందిన అలివేల కలిసి నాగర్ కర్నూల్ లోని ఓ పూజ స్టోర్ నుంచి బంగారు పూత పూసిన నకిలీ కాయిన్స్ కొనుగోలు చేసి ప్లాన్ మేరకు పాతిపెట్టి పూజలు చేసేవారు.
తన వద్దకు వచ్చిన బిజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ కు చెందిన శ్రీరామ్ సాగర్ నుంచి రూ.4 లక్షలు, నాగర్ కర్నూల్ మండలం శ్రీపురం గ్రామానికి చెందిన నిరంజన్ నుంచి రూ.3.50 లక్షలు డబ్బులు తీసుకుని మోసగించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి బుధవారం ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసినట్టు ఎస్పీ తెలిపారు.
