యువతిని చితకబాదిన ఇద్దరు మహిళలు.. వైరల్​ అవుతున్న వీడియో

యువతిని చితకబాదిన ఇద్దరు మహిళలు.. వైరల్​ అవుతున్న వీడియో

ఇద్దరు యువతులు టీనేజర్​ని చితకబాదిన వీడియో ఒకటి సోషల్​ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని బాధిత యువతి సోదరుడు ట్విటర్​లో షేర్​ చేశాడు. బ్రిటన్​(యూకే)లోని ఓ పార్కులో ఇద్దరు మహిళలు ఓ యువతిని తలపై, కాళ్లపై విచక్షణ రహితంగా చితకబాదుతుండటం వీడియోలో కనిపిస్తోంది.  

ఇందుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.  వీడియోకి నెటిజన్లు స్పందిస్తూ.. నిందితులపై చర్యలు తీసుకోవాలని ఒకరు కోరగా.. ఈ రేంజ్​లో బెదిరించారంటే భయమేస్తోందని మరొకరు రిప్లై ఇచ్చారు.