షూటర్ల కాల్పుల్లో ఇద్దరు మహిళలు మృతి.. రుణ వివాదంపై అనుమానాలు

షూటర్ల కాల్పుల్లో ఇద్దరు మహిళలు మృతి.. రుణ వివాదంపై అనుమానాలు

జూన్ 18 తెల్లవారుజామున ఢిల్లీలోని ఆర్‌కే పురం పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని షూటర్ల కాల్పుల్లో ఇద్దరు మహిళలు మరణించారని పోలీసులు తెలిపారు. అనంతరం ఆ ఇద్దరు మహిళలను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్పష్టం చేశారు.

సౌత్ వెస్ట్ ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ మనోజ్ సి తెలిపిన వివరాల ప్రకారం, అంబేద్కర్ బస్తీలో తమ సోదరీమణులను కొందరు కాల్చిచంపారని ఆర్కే పురం పోలీస్ స్టేషన్‌లో తెల్లవారుజామున 4:40 గంటలకు పోలీసులకు కాల్ వచ్చింది. కాల్‌కు ప్రతిస్పందించిన పోలీసు బృందం.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు పింకీ (30), జ్యోతి (29)పై కాల్పులు జరిపారని, వారిని SJ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించారు.

షూటర్స్.. బాధితురాలి సోదరుడి కోసం వెతుకుతున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. డబ్బుకు సంబంధించిన సెటిల్ మెంటే ఈ కాల్పుల వెనుక కారణం అని ప్రధానంగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన కారణాలను విచారణ తర్వాత వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.