వీగన్‌‌‌‌ డైట్‌‌‌‌ రకాలు..వాటి ప్రయోజనాలు..

వీగన్‌‌‌‌ డైట్‌‌‌‌ రకాలు..వాటి ప్రయోజనాలు..

వీగన్ డైట్‌‌‌‌లో మొక్కలు, -పండ్లు, కూరగాయలు, బీన్స్, ధాన్యాలు, నట్స్‌‌‌‌, సీడ్స్‌‌‌‌ మాత్రమే ఉంటాయి. ఈ డైట్‌‌‌‌ పాటించేవాళ్లు డైరీ, గుడ్లు, తేనెతో సహా యానిమల్‌‌‌‌ ఫుడ్స్‌‌‌‌ ఏవీ తీసుకోరు. దాదాపు 3 శాతం అమెరికన్లు ఈ డైట్‌‌‌‌ పాటిస్తుంటారు. ఈ మధ్య మన దగ్గర కూడా ఈ డైట్‌‌‌‌ ఫాలో అయ్యేవాళ్ల సంఖ్య పెరిగింది. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఈ డైట్‌‌‌‌ని ఫాలో కావాలని ప్రచారం కూడా చేస్తున్నాయి. కొంతమంది ఆరోగ్యం కోసం ఈ డైట్‌‌‌‌ పాటిస్తే.. మరికొందరు పర్యావరణానికి, జంతువులకు హాని చేయకూడదనే ఉద్దేశంతో చేస్తున్నారు. అయితే.. ఈ డైట్‌‌‌‌లో ప్రయోజనా లతోపాటు ఎదుర్కోవాల్సిన సవాళ్లు కూడా కొన్ని ఉన్నాయి. 

వీగన్ వర్సెస్ వెజిటేరియన్‌‌‌‌

చాలామంది వీగన్‌‌‌‌ డైట్‌‌‌‌ అంటే వెజిటేరియన్ డైట్ అనుకుంటారు. కానీ.. ఈ రెండింటి మధ్య కొంత తేడా ఉంది. వెజిటేరియన్ డైట్‌‌‌‌తో పోలిస్తే.. వీగన్ డైట్ కాస్త కఠినంగా ఉంటుంది. వెజిటేరియన్స్‌‌‌‌ మాంసం, పౌల్ట్రీ, చేపలు వంటి జంతువుల మాంసాన్ని మాత్రమే తినరు. డైరీ ప్రొడక్ట్స్‌‌‌‌, గుడ్లు తింటారు. వీగన్స్ వాటిని కూడా తినరు. అందుకే దీన్ని ఒక డైట్ అనేకంటే కూడా ఒక జీవన విధానం అనొచ్చు.  జంతువులు, పర్యావరణాన్ని రక్షించే లైఫ్ స్టయిల్ ఇది. ఎథికల్ వీగన్స్‌‌‌‌ యానిమల్‌‌‌‌ బేస్డ్‌‌‌‌ ఫుడ్‌‌‌‌ తినకపోవడంతో పాటు ఉన్ని, తోలు లాంటి వాటితో తయారు చేసిన వస్తువులను కూడా వాడరు. 

వీగన్‌‌‌‌ డైట్‌‌‌‌ 

వీగన్ డైట్స్ రకాలు

రా వీగన్ డైట్‌‌‌‌: రా వీగన్స్ పచ్చి మొక్కల ఫుడ్స్‌‌‌‌ మాత్రమే తింటారు. ఇందులో పండ్లు, కూరగాయలు, నానబెట్టిన గింజలు, కోల్డ్‌‌‌‌ ప్రెస్డ్‌‌‌‌ ఆయిల్స్‌‌‌‌, మొలకెత్తిన, నానబెట్టిన ధాన్యాలు, కిమ్చి, మిసో లాంటి పులియబెట్టిన ఆహారాలు ఉంటాయి. దీని వెనుక ఉన్న సిద్ధాంతం ఏంటంటే.. వండటం వల్ల  పోషకాలు విచ్ఛిన్నం అవడంతో పాటు పోషక విలువలు తగ్గుతాయి. విటమిన్ బి, సిలను కోల్పోయే అవకాశం ఉంది. రా వీగన్ ఫుడ్‌‌‌‌లో లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. విటమిన్లు, మినరల్స్‌‌‌‌ అందించే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తింటారు. దానివల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. ఫైబర్ వల్ల క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది. కానీ.. ప్రొటీన్, విటమిన్‌‌‌‌ డి, బి12, క్యాల్షియం, ఐరన్‌‌‌‌, అయోడిన్‌‌‌‌ సహా కొన్ని పోషకాలు శరీరానికి సరిపడా అందవు. 

వీగన్ కీటో డైట్: కీటో డైట్ అనేది చాలా తక్కువ కార్బ్, ఎక్కువ ఫ్యాట్స్‌‌‌‌, కాస్త ప్రొటీన్ ఉండే డైట్‌‌‌‌. కీటో డైట్‌‌‌‌లో తినేది ఎక్కువగా యానిమల్‌‌‌‌ బేస్డ్ ఫుడ్. ఇందులో శరీరానికి అవసరమయ్యే  కేలరీల్లో 75  నుంచి -80 శాతం వరకు ఫ్యాట్స్,10 నుంచి -20 శాతం ప్రొటీన్స్‌‌‌‌, 5  నుంచి10 శాతం కార్బ్ నుంచి తీసుకుంటారు. అందుకోసం హై ఫ్యాట్స్ వీగన్‌‌‌‌ ఫుడ్స్‌‌‌‌ అవకాడో, నట్స్‌‌‌‌, సీడ్స్‌‌‌‌, కొబ్బరి, ఆలివ్ ఆయిల్‌‌‌‌ లాంటివి ఎక్కువగా వాడతారు. అంటే నాన్‌‌‌‌వెజ్‌‌‌‌ ప్రొడక్ట్స్ జోలికి వెళ్లకుండా కీటో పద్ధతిలో వీగన్ డైట్ చేస్తారు. 

ధాన్యాలు, వాటితో చేసిన బ్రెడ్, పాస్తా లాంటివి తింటారు. ఆలుగడ్డలు, మొక్కజొన్న, బీన్స్, చిక్కుళ్ళు లాంటి కార్బ్స్‌‌‌‌ ఎక్కువగా ఉండే  కూరగాయలు చాలా మితంగా తింటారు. పైనాపిల్, మామిడి, అరటి లాంటి తీపి ఎక్కువగా ఉండే పండ్లను అస్సలు తినరు. పండ్ల రసాలు, స్వీట్లకు కూడా దూరంగా ఉంటారు. అయితే.. ఈ డైట్‌‌‌‌ వల్ల కూడా కొందరిలో పోషకాహార లోపం వచ్చే ప్రమాదం ఉంది. అందుకని ఇది తక్కువ రోజులు చేయడానికి సేఫ్‌‌‌‌. అలాకాకుండా ఏండ్ల తరబడి చేస్తామంటే సమస్యలు కొని తెచ్చుకున్నట్టే అంటున్నారు ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌. 

ఇందులో వీగన్‌‌‌‌ డయాబెటిక్‌‌‌‌ డైట్‌‌‌‌, హై ప్రొటీన్ వీగన్‌‌‌‌ డైట్‌‌‌‌, అల్కలైన్‌‌‌‌ వీగన్ డైట్‌‌‌‌, వీగన్‌‌‌‌ యాంటీ ఇన్​ఫ్లమేటరీ డైట్‌‌‌‌.. అని మరికొన్ని రకాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా కొందరు ఫాలో అవుతుంటారు.    

ప్రయోజనాలు ఎన్నో ...

ప్లాంట్ బేస్డ్‌‌‌‌ ఫుడ్‌‌‌‌ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, వాటితో చాలా రకాల వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చని ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌ అంటున్నారు. ఒక స్టడీ ప్రకారం.. ప్లాంట్ బేస్డ్‌‌‌‌ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల  టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 23 శాతం తగ్గుతుందని తేలింది. వెజిటేరియన్ ఫుడ్ తినేవాళ్లకు మాంసం తినేవాళ్ల కంటే ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 35 శాతం తక్కువగా ఉందని సైంటిస్ట్‌‌‌‌లు కనుగొన్నారు. వీళ్లకు గుండె సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా తక్కువగా ఉంటుందని ఓ స్టడీలో తేలింది. ఈ డైట్‌‌‌‌లో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు ఎక్కువగా తినడం వల్ల ఫైబర్, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వ్యాధుల నుంచి రక్షించడంలో సాయం చేస్తాయి.