టెర్రరిజంపై పోరులో భారత్‎కు యూఏఈ, జపాన్ మద్దతు

టెర్రరిజంపై పోరులో భారత్‎కు యూఏఈ, జపాన్ మద్దతు

అబుదాబి/టోక్యో: టెర్రరిజంపై పోరాటంలో ఇండియాకు తమ పూర్తి మద్దతు ఉంటుందని యూఏఈ, జపాన్​ ప్రకటించాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ టెర్రరిజాన్ని ప్రపంచానికి చాటేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన అఖిలపక్ష బృందాలు గురువారం ఆయా దేశాలకు చేరుకున్నాయి. శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే నేతృత్వంలోని బృందం యూఏఈకి, జేడీ(యూ) ఎంపీ సంజయ్ ఝా నేతృత్వంలోని బృందం జపాన్​ చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ తర్వాత పరిణామాలను ఆయా దేశాల ప్రతినిధులకు వివరించాయి. ఈ సందర్భంగా రెండు దేశాలూ భారత్‎కు మద్దతు తెలిపాయి.