యూఏఈ ప్రధానికి అందిన కరోనా వ్యాక్సిన్

యూఏఈ ప్రధానికి అందిన కరోనా వ్యాక్సిన్

యూఏఈ ప్రధాని  షైక్ మహ్మద్ బీన్ కరోనా వ్యాక్సిన్ అందింది . ఈ సందర్భంగా షైక్ మహ్మద్ తాను కరోనా వ్యాక్సిన్ ను ఇంజక్ట్ చేయించుకుంటున్న ఫోటోల్ని సోషల్ మీడియాలో చేశారు.

నేను కరోనా వ్యాక్సిన్ ఇంక్షన్ చేయించుకున్నాను. ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. వ్యాక్సిన్ కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న సిబ్బందిని చూస్తుంటే గర్వంగా ఉందని ట్వీట్ లో పేర్కొన్నారు

యూఏఈకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ అల్ జజీరా వివరాల ప్రకారం..యూఏఈ ప్రధాని  షైక్ చేయించుకున్న వ్యాక్సిన్ చైనాకు చెందిన సినోఫోరం తయారు చేసినట్లు తెలుస్తోంది. కాగా చైనా–యూఏఈల భాగస్వామ్యంలో చైనా..యూఏఈలో వ్యాక్సిన్ కు సంబంధించి పరిశోధనలు జరుపుతుంది. ఈ పరిశోధనలు సత్పలితాలు ఇవ్వడంతో తానూ కూడా వ్యాక్సిన్ ను వేయించుకున్నట్లు యూఏఈ ప్రధాని షైక్ వెల్లడించారు.

కాగా వ్యాక్సిన్ పరిశోధనలు చివరి దశలో ఉండగా..ఈ ఏడాది సెప్టెంబరులో యూఏఈ తన ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలకు అత్యవసర ఉపయోగం కోసం చైనా కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను ఆమోదించింది.