ఏపీ సీఎం జగన్ నివాసంలో ఉగాది వేడుకలు

ఏపీ సీఎం జగన్ నివాసంలో ఉగాది వేడుకలు

ఏపీ సీఎం జగన్ నివాసంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు సంప్రదాయం ప్రకారం ఉగాది సంబరాలు నిర్వహించారు. అంతకుముందు జగన్ దంపతులు వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కొత్త పంచాంగాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఆ తర్వాత వారు పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు.

శోభకృత్ నామ సంవత్సరంలో రాబోయే కాలమంతా శుభసూచకంగా ఉంటుందని పంచాంగ కర్త తెలిపారు. ఈ సారి పేరుకు తగ్గట్టుగా అంతా మంచే జరుగుతుందన్నారు. గురు, శని, కుజుడు సంచారాలు బాగున్నాయని, నవ నాయకుల ఫలితాలు సైతం అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. శ్రామికులకు, కర్షకులకు లాభదాయకంగా ఉంటుంది. వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి.