దమ్ముంటే నాతో పోటీ పడు.. గెలిచినోళ్లకే ఉక్రెయిన్

దమ్ముంటే నాతో పోటీ పడు.. గెలిచినోళ్లకే ఉక్రెయిన్

న్యూఢిల్లీ: టెస్లా, స్సేస్​ ఎక్స్ చీఫ్​ ఎలాన్​ మస్క్.. రష్యా ప్రెసిడెంట్​ వ్లాదిమిర్​ పుతిన్​కు చాలెంజ్​ విసిరారు. సింగిల్​ కాంబాట్​ఫైట్(ద్వంద్వ యుద్ధం) చేద్దామని, గెలిచిన వారికే ఉక్రెయిన్​ సొంతమవుతుందంటూ సోమవారం ఒక ట్వీట్​ చేశారు. ఉక్రెయిన్, పుతిన్​ పేర్లను రష్యన్​ అక్షరాల్లో పోస్ట్​ చేశారు. మరికొద్దిసేపటికే ఇంకో ట్వీట్​ చేసిన మస్క్.. ఫైట్​కు సిద్ధమేనా? అంటూ రష్యా అధ్యక్షుడి అధికారిక ట్విట్టర్​ ఖాతాను ట్యాగ్ చేశారు. దీనిని పూర్తిగా రష్యాన్​ అక్షరాల్లోనే పోస్ట్ చేశారు. మస్క్​ ఫాలోవర్​ ఒకరు ఈ చాలెంజ్​విషయంలో సీరియస్ గా ఉన్నారా? అని ప్రశ్నించగా.. తాను ఈ విషయంలో చాలా సీరియస్​గా ఉన్నానని మస్క్ స్పష్టం చేశారు. కాగా, ఉక్రెయిన్​పై రష్యా దాడులు మొదలైన తర్వాత.. ఇంటర్నెట్​ సమస్యలు తలెత్తడంతో మస్క్ తన స్టార్లింక్ శాటిలైట్​ ద్వారా అక్కడి ప్రజలకు ఇంటర్నెట్ సేవలు 
అందిస్తున్న సంగతి తెలిసిందే.