మా ప్రజలు, భూములను కాపాడుకునేందుకు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం

మా ప్రజలు, భూములను కాపాడుకునేందుకు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం
  • ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా

రష్యా దౌర్జన్యంగా చేస్తున్న దురాక్రమణను ఉక్రెయిన్ సమర్థవంతంగా తిప్పి కొడుతుందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా స్పష్టం చేశారు. కాల్పుల విరమణ కోసం టర్కీలో రష్యా విదేశాంగ శాఖ మంత్రులతో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా, ప్రతినిధులు పాల్గొన్నారు. 24గంటలపాటు కాల్పుల విరమణ కోసం మేం చర్చించినా.. రష్యా విదేశాంగ మంత్రి అంగీకరించలేదు. మానవతా కారిడార్ల ఏర్పాటు పై నైనా సానుకూల స్పందన వస్తుందనుకుంటే ఆ విషయంలోనూ ఇదే పరిస్థితి. ఎలాంటి హామీ రాలేదు. దీన్ని బట్టి ఉక్రెయిన్ పై రష్యా దాడుల విషయంలో మరింత మంది నిర్ణయాధికారాలున్న వారు రష్యాలో ఉన్నారని అర్థమైంది. రష్యా ఎన్ని దాడులు చేసినా వాటిని తిప్పికొట్టేందుకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని.. ఉక్రెయిన్ ఇప్పటి వరకు లొంగిపోలేదు.. లొంగిపోదు కూడా అని ఆయన స్పష్టం చేశారు. యుద్ధ పరిస్థితి పోతుందన్నా.. సమస్యలు పరిష్కారం అవుతాయన్నా  మళ్లీ రష్యా విదేశాంగ శాఖతో భేటీకి సిద్ధంగా ఉంటాం.. మా దౌత్య ప్రయత్నాలకు ఎలాంటి ఆటంకం ఉండదు.. అలాగే మా భూములను, ప్రజలను రష్యా నుంచి కాపాడుకునేందుకు ఎలాంటి త్యాగాలకు వెనుకడుగు వేసేది లేదని.. చిత్తశుద్ధితో ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తామని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా చెప్పారు. 

 

ఇవి కూడా చదవండి

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ అప్‎డేట్స్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్ అప్‎డేట్స్