ప్రపంచంలోనే అతి పెద్ద కార్గో ఫ్లైట్.. రష్యా దాడుల్లో ధ్వంసం

ప్రపంచంలోనే అతి పెద్ద కార్గో ఫ్లైట్.. రష్యా దాడుల్లో ధ్వంసం

ఉక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. సరిహద్దుల్లో నుంచి దేశంలోకి చొచ్చుకొచ్చిన రష్యన్ బలగాలను ఉక్రెయిన్ ఆర్మీ దీటుగా ఎదుర్కొంటోంది. రాజధాని కీవ్ నగరాన్ని రష్యా చేతిలోకి వెళ్లనీయకుండా అసామాన్యం పోరాటం సాగిస్తున్నారు. రష్యా ఆర్మీ భారీ క్షిపణులు, బాంబులతో దాడికి దిగుతుంటే.. ఉక్రెయిన్ లో సైనిక పరంగా బలహీనంగా ఉన్నా సరే గడిచిన మూడ్రోజులుగా రాజధానిని కాపాడుకోవడంలో గట్టి పట్టును ప్రదర్శిస్తోంది. అయితే రష్యా వైమానిక దాడుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం ఏఎన్ 225 మ్రియా ధ్వంసంమైంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపంలోని హోస్టోమెల్ ఎయిర్ పోర్టు వద్ద మ్రియా క్రాష్ అయ్యింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ధ్రువీకరించారు. ఉక్రెయిన్ భాషలో మ్రియా అంటే.. కల అని అర్థం. మ్రియాను ఉక్రెయిన్ ఎరోనాటిక్స్ కంపెనీ ఆంటోనోవ్ తయారు చేసింది. ఈ ప్రపంచంలోనే అతి పెద్ద విమానాన్ని రష్యా కీవ్ సమీపంలో క్రాష్ చేసింది. స్వేచ్ఛాయుత, ప్రజాస్వామ్య ఉక్రెయిన్ కలను నెరవేరుస్తామని... ఉక్రెయిన్ అధికార ట్విట్టర్ హ్యాండిల్ పోస్ట్ చేసింది. వారు అతి పెద్ద విమానాన్ని తగులబెట్టారు. కానీ మా మ్రియా ఎప్పటికీ నశించదని రాసి.... ప్లేన్ ఉన్న పిక్చర్ ను పోస్టు చేశారు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో.

మరిన్ని వార్తల కోసం..

పిల్లల రాకతో సంతోషంలో తల్లిదండ్రులు

ఆధార్ కార్డ్‌‌‌‌లో  ఫొటో మార్చండి ఇలా...

నల్లమల చెంచులపై  రాజ్‌భవన్​ ఫోకస్