ఉక్రెయిన్ ఎఫెక్ట్: బేర్మన్న స్టాక్ మార్కెట్

ఉక్రెయిన్ ఎఫెక్ట్: బేర్మన్న స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఉక్రెయిన్, రష్యా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపాయి. రష్యా దాడులు మరికొన్ని రోజులు కొనసాగవచ్చన్న అంచనాలు, బ్యారెల్ క్రూడాయిల్ ధర 110 డాలర్లకు దాటడం ఇన్వెస్టర్లలో ఆందోళనకు కారణమైంది. అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ఉండటం కూడా దేశీయ మార్కెట్ పై ప్రతికూల ప్రభావం చూపింది. ఫలితంగా సెన్సెక్స్ భారీగా నష్టపోయింది.

ఉదయం 55,629.30 పాయింట్ల వద్ద ప్రారంభమైన మార్కెట్లో 55,755.09పాయింట్లు ఇవాళ్టి గరిష్ఠ స్థాయి. ఒకదశలో 55,020.10 పాయింట్లు కనిష్ఠ స్థాయికి పతనమైన సెన్సెక్స్.. మార్కెట్ ముగిసే సమయానికి 778.38 పాయింట్ల నష్టంతో 55,468.90 వద్ద ముగిసింది. మారుతి సుజుకీ షేర్లు 6శాతంపైగా నష్టపోయాయి. డాక్టర్ రెడ్డీస్, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, సన్ ఫార్మా షేర్లు భారీగా లాసయ్యాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 187.95పాయింట్ల నష్టంతో 16,605.95 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తల కోసం..

97శాతం మార్కులొచ్చినా మెడికల్ సీటు రాలే

చర్చలకు ముందు బాంబు దాడుల్ని నిలిపేయండి