రష్యన్ బలగాలు వద్ద బందీగా 3 లక్షల మంది పౌరులు

రష్యన్ బలగాలు వద్ద బందీగా 3 లక్షల మంది పౌరులు

రష్యా తాత్కాలికంగా కాల్పుల విమరణ ప్రకటించినా.. ఉక్రెయిన్ లో భయానక పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఐదు నగరాల్లో కాల్పులు విరమించినట్లు ప్రకటించినా.. పౌరుల తరలింపును రష్యా  అడ్డుకుంటోందని ఉక్రెయిన్ విదేశాంగశాఖ మంత్రి డిమిత్రో కులెబా  ఆరోపించారు. రష్యన్ బలగాలు తమ వద్ద 3లక్షల మందిని బందీలుగా చేసుకున్నాయని అన్నారు. ఒక్క మరియూపోల్ లోనే ఇంత భారీ సంఖ్యలో పౌరులను బంధించిందని చెప్పారు. ICRC మధ్యవర్తిత్వంతో ఒప్పందం చేసుకున్నప్పటికీ  పౌరుల  తరలింపును రష్యా అడ్డుకోవడం దారుణమని కులెబా ట్వీట్ చేశారు.నిన్న ఓ చిన్నారి డీహైడ్రేషన్ తో చనిపోయిందని అన్నారు. రష్యా కావాలనే వార్ క్రైమ్స్ చేస్తోందని, అన్ని ప్రపంచ దేశాలూ ఇప్పటికైనా ప్రజలను సేఫ్ గా వెళ్లనివ్వాలని రష్యాను డిమాండ్ చేయాలని కోరారు.


మరోవైపు, సుమీ నగరంలోని నివాస భవనాలపై రష్యా జరిపిన దాడుల్లో.. సోమవారం ఇద్దరు పిలలతో సహా మొత్తం 9మంది చనిపోయారని ఉక్రెయిన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్ ప్రకటించింది.ఉదయం మైకోలైవ్ మిలటరీ బేస్ పై రష్యా దాడులు చేసింది. ఈ ఘటనలో 8 మంది సైనికులు చనిపోయారని, మరో 19 మందికి గాయాలయ్యాయని ఉక్రెయిన్ తెలిపింది.

మరిన్ని వార్తల కోసం..

మత పిచ్చిగాళ్లను బంగాళాఖాతంలో విసిరేయాలి

నిరుద్యోగులు టీవీ చూడండి.. రేపు అసెంబ్లీలో ప్రకటన చేస్త

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్