మే 9 నాటికి యుద్ధాన్ని ముగించాలని రష్యా టార్గెట్

మే 9 నాటికి యుద్ధాన్ని ముగించాలని రష్యా టార్గెట్
  • ఉక్రెయిన్‌ ఆర్మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నెల రోజులగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఉక్రెయిన్‌లోని పలు సిటీలను స్వాధీనం చేసుకున్న రష్యన్ బలగాలు.. ఆ దేశ రాజధాని కీవ్‌ను ఆక్రమించేందుకు శతవిధాలా ప్రయత్నస్తున్నాయి. రాజధానిని తమ చెరలోకి తెచ్చుకుంటే యుద్ధానికి ముగింపు చెప్పొచ్చన్నది రష్యా భావన. అయితే ఇది జరగనీయకుండా చేయాలని ఉక్రెయిన్ ఆర్మీ తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. అయితే తమ లక్ష్యానికి చేరుకుని యుద్ధాన్ని ముగించే విషయంలో రష్యా సేనలకు ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ డెడ్ లైన్ పెట్టాడని వార్తలు వస్తున్నాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ మే 9 నాటికి ముగియాలని రష్యన్ బలగాలకు టార్గెట్ పెట్టినట్లు ఉక్రెయిన్ ఆర్మీ ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందిందని ఆ దేశ మీడియా సంస్థ కీవ్ ఇండిపెండెంట్ పేర్కొంది. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ నాజీలపై సాధించిన విజయానికి గుర్తుగా ఆ రోజున రష్యాలో ఏటా ఘనంగా వేడుకలు చేస్తారు. ఈ నేపథ్యంలో చరిత్రలో నిలిచిపోయేలా మరో విజయాన్ని అదే రోజు సాధించినట్లుగా చెప్పుకోవాలన్న ఆలోచనతో రష్యా ఆ రోజును డెడ్ లైన్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తల కోసం..

RRR రివ్యూ: ఎవ్వరూ తగ్గలే!

ఇసుక కోసం రెండు గ్రామాల మధ్య కొట్లాట

బాబాకు నైవేద్యంగా మద్యం బాటిళ్లు