లిక్కర్ షాప్ పై ఆవు పేడ విసిరిన ఉమా భారతి

లిక్కర్ షాప్ పై ఆవు పేడ విసిరిన ఉమా భారతి

గత కొంత కాలంగా రాష్ట్రంలో మద్యం నిషేధం కోసం పోరాటం చేస్తోన్న మధ్యప్రదేశ్ మాజీ సీఎం, భాజపా ఫైర్ బ్రాండ్ గా పిలుచుకునే ఉమా భారతి గురించి ఎంత చెప్పినా తక్కువే. తాజాగా ఆమె చేసిన ఓ పని వైరలా మారింది. మద్యం దుకాణంపై ఏకంగా ఆవుపేడతో దాడి చేయడం అంతటా చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్ లోని నివారి జిల్లాలో ఆధ్యాత్మిక నగరమైన ఓర్చాలో మద్యం దుకాణం తెరవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ స్థలానికి అనుమతి లేదన్న ఆమె.. పవిత్రమైన ఓర్చా ప్రాంతంలో లిక్కర్ షాప్ ఓపెన్ చేయడం నేరమని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ఈ వీడియో తీసిన వ్యక్తితో "చూడండి... నేను ఆవు పేడ విసిరాను. రాళ్లు రువ్వలేదు" అని ఉమాభారతి అన్నట్టుగా తెలుస్తోంది.