Big Breaking: 146 కోట్లకు చేరిన ఇండియా జనాభా : 68 శాతం మందికి పని చేసే సత్తా ఉంది..!

Big Breaking: 146 కోట్లకు చేరిన ఇండియా జనాభా : 68 శాతం మందికి పని చేసే సత్తా ఉంది..!

Indian Fertility Rate Drop: ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. 2025లో భారత జనాభా 146 కోట్లుగా ఉంటుందని యునైటెన్ నేషన్స్ డెమెుగ్రాఫిక్స్ రిపోర్ట్ పేర్కొంది. అయితే ఇదే సమయంలో ఒక ఆందోళనకరమైన విషయాన్ని కూడా రిపోర్ట్ బయపపెట్టింది. ప్రస్తుతం భారతదేశంలో సంతానోత్పత్తి రేటు భర్తీ రేటు కంటే తక్కువగా ఉందంది. అంటే చనిపోతున్న వ్యక్తుల స్థానంలో కొత్తగా పుడుతున్న వారి సంఖ్య తక్కువగా ఉందని ఇది సూచిస్తుంది. భారతదేశం సంతానోత్పత్తి రేటును తగ్గించడంలో భారీ పురోగతి సాధించిన సంగతి తెలిసిందే. 1970లో దాదాపు ఐదుగురు పిల్లలు ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆ సంఖ్య కుటుంబంలో ఇద్దరు పిల్లలు తగ్గింది. 

ది రియల్ ఫెర్టిలిటీ క్రైసిస్ పేరుతో రూపొందించిన రిపోర్టులో కీలక గణాంకాలను పంచుకుంది. దేశంలో మహిళలకు సంతానోత్పత్తి రేటు 1.9 శాతంగా ఉందని వెల్లడించగా.. ఇది భర్తీ రేటు 2.1 కంటే తక్కువని తేలింది. ఈ పరిస్థితి కారణంగా జనాభా తగ్గుదల ప్రారంభమౌతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ ఒక గమనించదగిన శుభవార్త ఏంటంటే.. ఫెర్టిలిటీ రేటు తగ్గినప్పటికీ ఇండియాలో యువ జనాభా సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు నివేదిక చెబుతోంది.

మెుత్తం జనాభా విభజన..
* 0-14 ఏళ్ల మధ్య వయస్కులు 24 శాతం
* 10-19 ఏళ్ల మధ్య వయస్కులు 17 శాతం
* 10-24 ఏళ్ల మధ్య వయస్కులు 26 శాతం
* దేశ జనాభాలో పనిచేసే వయస్సు వారు 68 శాతం 
* దేశంలో వృద్ధుల సంఖ్య 7 శాతం

ఇక ఆయుర్ధాయం విషయానికి వస్తే పురుషులు సగటున 71 సంవత్సరాలు జీవిస్తుండగా.. మహిళల విషయంలో ఇది కొద్దిగా ఎక్కువగా 74 ఏళ్లుగా ఉంది. రానున్న 40 ఏళ్ల పాటు కూడా భారత జనాభా పెరుగుతూనే ఉంటుందని నివేదిక అంచనా వేసింది. ఈ కాలంలో భారత జనాభా 170 కోట్లకు చేరుకోవచ్చని నివేదిక అంచనా వేసింది. ఆ తర్వాత క్రమంగా జనాభా తగ్గుతుందని వెల్లడించింది.