ఫ్రీ ఇన్సూరెన్స్.. ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్

ఫ్రీ ఇన్సూరెన్స్.. ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్

న్యూఢిల్లీ: యూజర్లను తమ వైపు తిప్పుకోవడానికి టెలికాం కంపెనీలు ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. తాజాగా ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్ టెల్ కూడా ఓ బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. రెండు ప్రీ పెయిడ్ ఆఫర్లను ప్రకటించిన ఎయిర్ టెల్.. అత్యంత వేగవంతమైన 4జీ ఇంటర్నెట్ స్పీడ్ ను ప్రొవైడ్ చేయడంతోపాటు లైఫ్ ఇన్సూరెన్స్ ను సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది. తొలి ఆఫర్ లో రూ.279తో రీచార్జ్ చేసుకుంటే 4జీ డేటా వేగంతో ప్రతి రోజూ 1.5 జీబీ వరకు డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు రూ.4 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ సదుపాయాన్ని ఎయిర్ టెల్ కల్పిస్తోంది. ఇక రూ.179తో రీఛార్జ్ చేసుకుంటే రూ.2 లక్షల జీవిత బీమా పొందొచ్చు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ బీమా పొందడానికి ఎలాంటి మెడికల్ టెస్టులు చేయించుకున్న డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే ఎలాంటి పేపర్ వర్క్ కూడా ఉండదు.