కోవూరులో కారు ప్రమాదం.. మామ, కోడలు మృతి

V6 Velugu Posted on Sep 14, 2021

నెల్లూరు జిల్లా కోవూరు జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరులోని హరినాథపురానికి చెందిన పార్లపల్లి మహేంద్ర తన కుటుంబంతో కలిసి కుమారుడిని తూర్పు గోదావరి జిల్లా తునిలో ఉన్న హాస్టల్‌లో చేర్పించి తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో కోవూరులోని ఏసీసీ కల్యాణ మండపం దగ్గరకు రాగానే కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. దీంతో కారులో ఉన్న మహేంద్ర తండ్రి పార్లపల్లి సుధాకర్‌రావు(76), భార్య అపర్ణ(35) అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదంలో మహేంద్రతో పాటు అతడి తల్లి వెంకట సుజాత, కూతురు సిసింద్రి(6) గాయపడ్డారు. గాయపడిన వారిని నెల్లూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తు చేపట్టారు.

Tagged car accident, uncle, Daughter-in-law, killed, kovoor

Latest Videos

Subscribe Now

More News