నిరుద్యోగుల దినం ఎలా పుట్టింది.. పని లేకపోవటంపై ప్రముఖులు ఏమన్నారు

నిరుద్యోగుల దినం ఎలా పుట్టింది.. పని లేకపోవటంపై ప్రముఖులు ఏమన్నారు

అంతర్జాతీయ నిరుద్యోగుల దినం ఒకటి ఉంది.. ఉద్యోగ, ఉపాధి కోసం 1930లో జరిగిన పోరాటాల ఫలితంలో.. మార్చి 6వ తేదీని అంతర్జాతీయ నిరుద్యోగుల దినంగా ప్రకటించింది ప్రపంచం. అప్పట్లో రష్యా, బెర్లిన్, ఇతర యూరోపియన్ యూనియన్ దేశాలతోపాటు అమెరికా వ్యాప్తంగా నిరుద్యోగం తీవ్ర స్థాయికి చేరింది. చేయటానికి పని లేక.. తింటానికి తిండి లేక ఆకలి కేకలతో యువత రోడ్డెక్కింది.  కోట్లాది మంది ఉద్యోగ, ఉపాధి కోసం పది రోజులపాటు ఉద్యమం చేశారు. దీంతో ఆయా దేశాలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాయి. దేశంలో యువతకు కల్పించాల్సిన సౌకర్యాలు ఏంటీ.. వాళ్లను సరైన దిశలో ఎలా తీసుకెళ్లాలి.. ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ఎవరిది.. అనే అనేక అంశాలు చర్చకు వచ్చాయి. 

అంతర్జాతీయ నిరుద్యోగ దినం సందర్భంగా.. కొందరు ప్రముఖులు  చేసిన కామెంట్స్ ఇలా ఉన్నాయి.

  •  నిరుద్యోగం అనేది మరణం కంటే దారుణమైనది.. సమాజంలోనే కాదు.. సొంత కుటుంబంలోనూ నిరాదరణకు గురవుతాం ‌‌– వై గాసెట్ అనే ఆర్థిక వేత్త విశ్లేషించారు.
  • రాజకీయ పార్టీల కంటే నిరుద్యోగం చాలా పెద్దది.. ఇది దేశంతోపాటు జాతీయ ప్రమాదానికి సంకేతం.. కుంభకోణాలు, నేరాలకు కారణం అవుతుంది – ఎలెన్ విల్కిన్సన్ 
  •  తన కుటుంబం కోసం నిస్సహాయంగా.. అతి కష్టంగా.. అనారోగ్యంతో ఉన్నా పనికి వెళుతున్నాడు అంటే.. అది ఆ సమాజానికే సిగ్గుచేటు.. ప్రభుత్వాల చేతగాని తనం – కార్లోస్ లామాస్
  • ఆధునిక ప్రపంచంలో కంప్యూటర్లు అన్ని సమస్యలను పరిష్కరించగలరు కానీ.. నిరుద్యోగ సమస్యను మాత్రం పరిష్కరించలేవు – లారెన్స్ పీటర్
  • వ్యాపారాలు ఉద్యోగ, ఉపాధిని సృష్టించే కేంద్రాలుగా ఉండాలి కానీ.. ప్రజా సంపదను, వనరులను దోచుకునే విధంగా ఉండకూడదు.. ప్రభుత్వాలు అలాంటి వారికి అండగా ఉండకూడదు – బ్రియాన్ సాడోవల్
  • ఇవాళ గ్రాడ్యుయేట్ లైన్లు ఎంత పొడవుగా ఉంటాయో.. రేపు నిరుద్యోగ లైన్లు అంత చిన్నవిగా ఉంటాయి – హెచ్.డబ్ల్యూ.బుష్
  • సామాజిక కోణంలో నిరుద్యోగం అనేది చిన్న అంశంగా చూస్తే.. అంత కంటే హృదయ విదారకరం ఏమీ లేదు – ఎలియనోర్