
- వేదిక ఇందిరా పార్కు నుండి బీజేపీ ఆఫీసుకు మార్పు
హైదరాబాద్: బీజేపీ తలపెట్టిన నిరుద్యోగ దీక్ష రేపు యధావిధిగా జరపనున్నట్లు పార్టీ నాయకులు ప్రకటించారు. ప్రభుత్వం కరోనా ఆంక్షల పేరుతో సభలు, సమావేశాలకు అనుమతి నిరాకరించడంతో ఇందిరాపార్కు వద్ద తలపెట్టిన దీక్షను బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి మార్చారు. బీజేపీకి ఎక్కడ ఆదరణ పెరుగుతుందోనన్న భయంతోనే ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ జీవో జారీ చేసిందని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. రేపు ఉదయం బీజేపీ రాష్ట్ర కార్యాలయ ఆవరణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష చేపడతారని వారు తెలిపారు.
దీక్షను విజయవంతం చేయండి: బీజేపీ ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి
నిరుద్యోగ దీక్షను ఇందిరా పార్క్ ధర్నా చౌక్ నుంచి బిజెపి స్టేట్ ఆఫీస్ కు మార్చామని బీజేపీ ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి తెలిపారు. నిరుద్యోగులు దీక్ష కు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ నిరుద్యోగ దీక్ష చేస్తుంటే కేసీఆర్ ప్రభుత్వానికి వణుకుపుడుతోందని, బీజేపీ పేరెత్తితే టీఆర్ఎస్ భయపడుతోందన్నారు. నిరుద్యోగ దీక్ష ను అడ్డుకునేందుకు కరోనా నిబంధనల పేరుతో హడావిడిగా జీవో విడుదల చేసిందని ఆరోపించారు. ప్రభుత్వము నిరుద్యోగ దీక్షను అడ్డుకోవడం తో బిజెపి రాష్ట్ర కార్యాలయంలోనే రేపు దీక్ష చేస్తామని, నిరుద్యోగులకు బిజెపి అండగా ఉంటుందని, నోటిఫికేషన్ లు వచ్చే వరకు పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి:
విద్యారంగంపై కరోనా తీవ్ర ప్రభావం
కేంద్రం ధాన్యం కొనకపోతే ఇండియా గేట్ వద్ద పోస్తాం
పిల్లలకు వ్యాక్సిన్ మంచిదే కానీ ఎప్పట్లో ఇస్తారు ?