మధ్యాహ్న భోజనంలో.. పురుగులు, రాళ్లు

మధ్యాహ్న భోజనంలో.. పురుగులు, రాళ్లు
  • హనుమకొండ సుబేదారి స్కూల్​లో అన్నం పడేసి నీళ్లు తాగిన స్టూడెంట్లు 

వరంగల్‍, వెలుగు: హనుమకొండ సుబేదారిలోని డీఈఓ ఆఫీస్‍ పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలో గురువారం మధ్యాహ్న భోజనంలో పురుగులు వచ్చాయి. తినలేని స్టూడెంట్లు ప్లేట్లలో పెట్టుకున్న అన్నాన్ని డస్ట్​బిన్​లో పడేశారు. ఆకలి మంటను తట్టుకునేందుకు మంచినీళ్లు తాగి పస్తులున్నారు. ఇది తమకు కొత్తకాదని మధ్యాహ్న భోజనం పేరుతో స్కూల్లో లంచ్‍ సమయంలో వడ్డించే ఆహారంలో రెగ్యులర్​గా పురుగులు, రాళ్లు, వెంట్రుకలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

టీచర్లకు చెప్తే దానిని పడేసి ఇంకాస్త అన్నం వేసుకోవాలని చెబుతున్నారని బాధపడ్డారు. సరిగ్గా ఉడకని అన్నం, పుచ్చులు పట్టిన కూరగాయలతో వండిన కూరలు తినలేకపోతున్నామని కన్నీరు పెట్టుకున్నారు. ఉదయం ఇంటివద్ద తినొస్తే సాయంత్రం వరకు ఆకలితోనే క్లాసులు వినాల్సివస్తోందన్నారు.