పిల్లలకు ఎలాంటి ఫుడ్డు పెట్టాలో చెబుతున్న యునిసెఫ్

పిల్లలకు ఎలాంటి ఫుడ్డు పెట్టాలో చెబుతున్న యునిసెఫ్

దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల్లో ఒకటి పిల్లల్లో పోషకాహార లోపం. మరి, దానిని ఎలా కట్టడి చేయడం? అంటే వచ్చే సమాధానం.. మంచి ఫుడ్డుపెట్టడం. మరి, మంచి ఫుడ్డు అంటే…! దానికే ప్రపంచ వ్యాప్తంగా పిల్లల బాగోగులను అరుసుకునే యునిసెఫ్  ఓ మెనూ తయారు చేసింది. ఆ మెనూతో ఓ బుక్కును అచ్చేసింది. 28 పేజీలున్న ఆ బుక్కులో పిల్లలకు ఏయే ఫుడ్డు పెట్టాలో వివరించింది. ఒక్కొక్క సమస్యకు ఒక్కో ఫుడ్డును సూచించింది. తక్కువ బరువున్న పిల్లలకు ఆలూ పరాటా, పనీర్ కట్టి రోల్, సాగో కట్ లెట్,లావున్నోళ్లకు మొలకెత్తిన పప్పులతో చేసిన పరాటా,పోహా (అటుకులు), కూరగాయలతో చేసిన ఉప్మా పెట్టాలని సూచించింది. అంతేగాకుండా ప్రొటీన్ ,కార్బొహైడ్రేట్ , కొవ్వు, ఫైబర్ (పీచు పదార్థం ), ఐరన్, విటమిన్ సీ, కాల్షియం ఎంతెంత మోతాదులో తీసుకోవాలో, ఏయే వంటల్లో ఎంతుంటుందో కూడా ఆ బుక్కులో యునిసెఫ్ వివరించింది. ఏయే వంటకుఎంత ఖర్చవుతుందో కూడా చెప్పింది.

‘‘పోషకాహారం కోసం ప్రతి మనిషికి రెండు దశలుంటాయి .ఒకటి పుట్టాక మొదటి వెయ్యి రోజులు. ఆ పిల్లలకు తల్లి పాలతో పాటు మంచి ఆహారం అవసరం. రెండో దశ యవ్వనం. ఆ దశలో స్కూల్ లోనే మంచి పోషకాహారం అందేలా చూసుకోవాలి” అని యునిసెఫ్ చీఫ్ హెన్రిటా హెచ్ ఫోర్ చెప్పారు . మొదటి దశ సక్సెస్ ఫుల్ గా జరగాలంటే హెల్త్​కేర్ వర్కర్లు ఆస్పత్రుల్లో పిల్లలకు పెట్టే ఆహారంపై తల్లులకు అవగాహన కల్పించాలని చెప్పారు . రెండో దశలో టీచర్లు పిల్లలకు మంచి తిండిపై వివరించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం స్కూళ్లలో కరికులం ఏర్పాటు చేయాలన్నారు . అంతకన్నా ముందు పిల్లల తల్లిదండ్రులకు పోషకాహారంపై అవగాహన ఉంటే, అంతకుమించిన పరిష్కారమూ ఇంకోటి ఉండదన్నారు . యునిసెఫ్ తయారు చేసిన పుస్తకాన్ని స్కూళ్లలో టీచ్ చేయాలని,కరికులంలో భాగం చేయాలని సూచించారు. దాని వల్ల పిల్లలకు మంచి పోషకాహారం అందే అవకాశం ఉంటుందని చెప్పారు . పుస్తకాన్ని ప్రాంతీయ భాషల్లోకి అనువదిం చి అందుబాటు లోకి తెస్తామని తెలిపారు. పిల్లలకు ఆ పుస్తకంలోని విషయాలను వివరించాలని చెప్పారు . ఈ పుస్తకం ఖరీదు కేవలం 20 రూపాయలేనట.