యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.
పోస్టు పేరు: అప్రెంటీస్.
మొత్తం ఖాళీలు: 1865. తెలంగాణ రాష్ట్రంలో 164 ఖాళీలు + పీడబ్ల్యూబీడీ 7 ఖాళీలు ఉన్నాయి.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. 2026, ఏప్రిల్ 1 కంటే ముందు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. పట్టభద్రులై నాలుగేళ్లు దాటకూడదు. అప్లై చేసిన రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంత స్థానిక భాషల్లో చదవడం, రాయడం, మాట్లాడటం, అర్థం చేసుకోకలగాలి.
వయోపరిమితి: 20 నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 29.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ పురుష అభ్యర్థులకు రూ. 944. జనరల్, ఓబీసీ మహిళా అభ్యర్థులకు రూ.708. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ట్రాన్స్ జెండర్ అభ్యర్థులకు రూ.236.
లాస్ట్ డేట్: మే 19.
ఆన్‌లైన్ ఎగ్జామ్ తేదీ: 2026 మే/ జూన్.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.unionbankofindia.co.inను సందర్శించండి.
ఎగ్జామ్ ప్యాటర్న్
రాత పరీక్ష ఆన్‌లైన్ పద్ధతిలో జరుగుతుంది. ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి. ఇందులో మొత్తం నాలుగు విభాగాలు ఉంటాయి. జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్ 25 ప్రశ్నలు 25 మార్కులకు, జనరల్ ఇంగ్లిష్ 25 ప్రశ్నలు 25 మార్కులకు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు 25 మార్కులకు, రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు 25 మార్కులకు ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 60 నిమిషాల్లో పూర్తిచేయాలి. నెగిటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4వ వంతు (0.25) కోత విధిస్తారు.
స్థానిక భాషా ప్రావీణ్యత పరీక్ష
రాత పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులను ఈ పరీక్షకు పిలుస్తారు. అభ్యర్థి ఏ రాష్ట్రానికైతే దరఖాస్తు చేసుకుంటారో ఆ రాష్ట్ర అధికారిక భాషపై పట్టు ఉండాలి. అభ్యర్థికి స్థానిక భాష చదవడం, రాయడం, మాట్లాడటం, అర్థం చేసుకోవడం వచ్చో లేదో ఈ పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. కానీ, ఇందులో విఫలమైతే తుది ఎంపికకు అనర్హులుగా ప్రకటిస్తారు.
మినహాయింపు: అభ్యర్థి తన 10వ తరగతి లేదా 12వ తరగతిలో స్థానిక భాషను ఒక సబ్జెక్టుగా చదివి ఉంటే ఈ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు.
