లక్సెట్టిపేట, వెలుగు: ప్రభుత్వ పథకాలపై ప్రజలకు పూర్తి అవగాహన ఉండాలని, ఇందుకోసం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు యూనియన్ బ్యాంక్ కరీంనగర్ రీజినల్ మేనేజర్ డి.అపర్ణ రెడ్డి తెలిపారు. శుక్రవారం లక్సెట్టిపేట మండలంలోని దౌడపల్లి గ్రామంలో యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన తదితర పథకాలను వివరించారు. డిజిటల్ లావాదేవీల ప్రాముఖ్యతను గ్రామీణ ప్రజలు తెలుసుకోవాలని చెప్పారు. అనంతరం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన లబ్ధిదారురాలైన తోగట్టి తిరుమల కుటుంబానికి రూ.2 లక్షల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో బ్యాంక్ దౌడపల్లి శాఖ మేనేజర్ బిశ్వనాథ్, సిబ్బంది పాల్గొన్నారు.
