జమ్ము కశ్మీర్‌లో తొలిసారి సీఆర్పీఎఫ్ రైజింగ్ డే

జమ్ము కశ్మీర్‌లో తొలిసారి సీఆర్పీఎఫ్ రైజింగ్ డే

దేశంలో ఎన్నికలు ప్రశాంతంగా జరగడంలో సీఆర్పీఎఫ్ జవాన్లదే కీలక పాత్ర అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. అలాగే జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదం నియంత్రణలో ఉందంటే.. అది మన బలగాలు సాధించిన విజయమని చెప్పారు. 2014లో మోడీ ప్రధాని అయ్యాక జమ్ము కశ్మీర్ లో పరిస్థితులు మెరుగుపడ్డాయని అన్నారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) 83వ రైజింగ్ డే కార్యక్రమంలో పాల్గొన్న షా... జవాన్ల గౌరవ వందనం స్వీకరించారు. దేశంలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడంలో సీఆర్పీఎఫ్ బలగాల పాత్ర ముఖ్యమైనదన్నారు. దేశంలో ఎక్కడైనా లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ప్రజలు ధైర్యంగా ఓటు వేసేందుకు సీఆర్పీఎఫ్ భరోసా, భద్రత కల్పిస్తుందని అమిత్ షా అన్నారు.

1950 మార్చి 19న సీఆర్పీఎఫ్ చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో ప్రతి ఏటా ఈ రోజున సీఆర్పీఎఫ్ రైజింగ్ డే వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.  అయితే దేశ రాజధాని వెలుపల సీఆర్పీఎఫ్ రైజింగ్ డే వేడుకలు జరుపుకోవడం ఇదే తొలిసారి.

మరిన్ని వార్తల కోసం..

రాజ్యాంగ పరిరక్షణ కోసం యద్ధ భేరి నిర్వహిస్తం

సాధారణం కన్నా 4 డిగ్రీలు ఎక్కువగా ఎండలు

ఇంజినీరుగా రిటైరైనంక.. ‘గేట్’ ర్యాంక్ కొట్టిండు