
హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 28న రాష్ట్రం లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్ల గెలుపే లక్ష్యంగా ఆయన పర్యటన సాగనుంది. అందులో భాగంగా మూడు ప్రాంతాల్లో పార్టీ నిర్వహించనున్న వివిధ సమ్మేళనా ల్లో ఆయన పాల్గొననున్నారు. ఆదివారం ఉదయం మహబూబ్ నగర్‌లో జరగనున్న ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీలతో సమావేశమవుతారు.
మధ్యాహ్నం కరీంనగర్‌లో అక్కడి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్‌కు చేరుకొని, ఫిల్మ్ నగర్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో బీజేపీ మహిళా మోర్చా ఏర్పాటు చేసిన మహిళా సమ్మేళనంలో పాల్గొంటారు.