కేసీఆర్ కావాల‌నే కేంద్రాన్ని బ‌ద్నాం చేస్తున్నారు

కేసీఆర్ కావాల‌నే కేంద్రాన్ని బ‌ద్నాం చేస్తున్నారు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో నెల‌కొన్ని వాట‌ర్ వార్‌పై స్పందించారు కేంద్ర మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌. తెలంగాణ తీసుకుంటున్న నిర్ణ‌యాల కారణంగానే ట్రిబ్యున‌ల్ ఏర్పాటులో ఆలస్యం జ‌రుగుతోంద‌న్నారు. ఈ రోజు(గురువారం) మీడియాతో  మాట్టాడారు షెకావ‌త్. మొన్న‌టి ప్రెస్‌ మీట్‌లో కావాల‌ని సీఎం కేసీఆర్ నా పేరు ప్ర‌స్తావ‌న‌కు తెచ్చారన్నారు. అందుక‌ని నేను రెస్పాండ్ కావాల్సి వ‌స్తోందన్నారు. అస్స‌లు నాకు దానితో సంబంధ‌మే లేదన్నారు. 2015లో కొత్త ట్రిబ్యునల్ ఎర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందన్నారు.

కావాల‌నే కేంద్రాన్ని కేసీఆర్ బ‌ద్నాం చేస్తున్నారని చెప్పారు మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఇద్ద‌రు సీఎంల అంగీకారం త‌ర్వాతే ట్రిబ్యున‌ల్ ఏర్పాటు జ‌రుగుతుందన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం 2020లో నిర్వహించానని.. 2020 , 6 అక్టోబర్ లో సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ ను..రెండు రోజుల్లో వెనక్కి తీసుకుంటానన్న కేసీఆర్ ...8 నెలల తర్వాత కేసును ఉపసంహరించుకున్నారని చెప్పారు. నెల రోజుల క్రితం సుప్రీం కోర్టులో పిటిషన్ ఉపసంహరణకు అనుమతి ఇచ్చిందని.. ఇప్పుడే మేము పని మొదలు పెట్టామని అన్నారు. కేసీఆర్ కారణంగానే ఇంత కాలం ఆలస్యమైందన్నారు. కేసీఅర్ వల్లనే ట్రిబ్యునల్ వ్యవహరం ముందుకు పోవటం లేదని..ఏడేళ్లుగా నేను పట్టించు కోవటం లేదు అనడం సరైంది కాదన్నారు. రాష్ట్రం చేసిన ఆలస్యానికి మమ్మల్ని ఎలా  బాధ్యులను చేస్తారని ప్రశ్నించారు. కేసీఅర్ మాటలు ప్రజాస్వామ్యన్ని అపాస్యం చేసేలా మాట్లడారన్నారు. కేసీఆర్ బాధ్యత గల పదవిలో ఉండి ఇలా మాట్లాడటం మంచిది కాదన్నారు. మాట్లాడే ముందు ఒకసారి అలోచించి మాట్లాడుతే మంచిదని సూచించారు.
ప్ర‌భుత్వాలు యాక్టివ్‌గా ఉండి బోర్డుల‌తో క‌లిసి ప‌నిచేయాలన్నారు కేంద్ర మంత్రి షెకావత్. ఇలా మాటిమాటికి వివాదాలు సృష్టించుకోవ‌డం అంత మంచిది కాదన్నారు.  అంతేకాదు..కొత్త ట్రిబ్యునల్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టామని..లీగల్ ఒపీనియన్ కోసం న్యాయ శాఖకు లేఖ రాశామన్నారు. కొత్తది ఏర్పాటు చేయాలా లేక పాత దాన్నే కొనసాగించాలా అన్నది నిర్ణయం జరగాల్సి ఉందన్నారు. విద్యుత్ ప్రాజెక్ట్ ల నిర్వహణ విషయంలో ఎలాంటి గందరగోళం లేదని.. నోటిఫికేషన్ లో పూర్తి స్పష్టత ఉంకదన్నారు షెకావత్.