
తెలంగాణాలో పంటల సాగుపై ఎలాంటి నిబంధనలు విధించలేదన్నారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. 2021 రబీ సీజన్ కు సంబంధించి వరి లేదా ఇతర పంటల సాగుపై కేంద్రం ఏమైనా నిబంధనలు విధించిందా అని కాంగ్రెస్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు నరేంద్ర సింగ్ తోమర్. రైతులు వరి సాగు చేయొద్దు.. ఇతర పంటలు వేసుకోవాలని సీఎం కేసీఆర్ చెబుతున్న నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం ప్రాధాన్యత సంతరించుకుంది.