పార్లమెంట్ కు గ్రీన్ హైడ్రోజన్ కారులో గడ్కరీ

పార్లమెంట్ కు గ్రీన్ హైడ్రోజన్ కారులో గడ్కరీ

న్యూఢిల్లీ: పార్లమెంటుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గ్రీన్ హైడ్రోజన్ కారులో వచ్చారు. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా నీటి నుంచి గ్రీన్ హైడ్రోజన్ ను ఉత్పత్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ... దేశంలో గ్రీన్ హైడ్రోజన్ తయారీ కోసం చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. దీంతో దిగుమతులు తగ్గి... ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. గ్రీన్ హైడ్రోజన్ తో నడిచే కారుని పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టామన్నారు. ఈ ప్రాజెక్టు కోసం 3 వేల కోట్ల మిషన్ ను కేంద్రం ప్రారంభించిందన్నారు. హైడ్రోజన్ ను ఎక్స్ పోర్ట్ చేసే స్థాయికి భారత్ ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఆ కారుకి ‘మిరాయ్’ అని పేరు పెట్టినట్లు తెలిపారు. మిరాయ్ అంటే భవిష్యత్ అని అర్థమని, ఇంధనాల విషయంలో స్వయం సాధికారత సాధించుతామాని నితిన్ గడ్కరీ ధీమా వ్యక్తం చేశారు. 

ఇవి కూడా చదవండి..

సికింద్రాబాద్ లో శుభకార్యానికి వెళ్లొచ్చేలోగా ఇల్లు దోపిడీ

ఎంబీబీఎస్ స్టూడెంట్కు వివేక్ వెంకటస్వామి నివాళి