కేటీఆర్, కవిత ఎవరైనా బీజేపీలోకి రావచ్చు: ప్రహ్లాద్ జోషి

కేటీఆర్, కవిత ఎవరైనా బీజేపీలోకి రావచ్చు: ప్రహ్లాద్ జోషి

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను బీజేపీలోకి రమ్మని బెదిరించారని సీఎం కేసీఆర్ చెప్పడాన్ని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఖండించారు.  కేసీఆర్ వ్యాఖ్యలు బోగస్ అని.. నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అవసరం బీజేపీకి లేదని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతున్నందుకే ఎంపీ అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ నేతలు దాడి చేశారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న బీజేపీ.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీజేపీలోకి కేటీఆర్‌, కవిత ఎవరు వచ్చినా సాధరంగా ఆహ్వానిస్తామని ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు.

ప్రధాని మోడీ తెలంగాణకు వస్తే కేసీఆర్‌ ఎందుకు ముఖం చాటేస్తున్నారని ప్రహ్లాద్ జోషి ప్రశ్నించారు. తాను చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడానికే కేసీఆర్ అలా చేస్తున్నారా అని విమర్శించారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. పీఎం ఆవాస్ యోజన పథకాన్ని సైతం తెలంగాణ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేకపోతోందని  ప్రహ్లాద్‌ జోషి అన్నారు.