మహారాష్ట్ర, యూపీలను విభజించాలి: కేంద్రమంత్రి అథవాలే

మహారాష్ట్ర, యూపీలను విభజించాలి: కేంద్రమంత్రి అథవాలే

ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలను విభజించాలని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే అన్నారు. ఈ విషయంలో తమ డిమాండ్ ను ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో గట్టిగా వినిపిస్తామని చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. యూపీ నుంచి పూర్వాంచల్ ను, మహారాష్ట్ర నుంచి విదర్భను వేరు చేసి ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పాటు చేయాలన్నారు. ఈ విషయంపై తమ పార్టీ డిమాండ్ ను ప్రధాని మోడీ ముందుంచుతామన్నారు.

ఎన్డీఏలో భాగస్వామ్య పక్షమైన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధినేత అయిన రాందాస్ అథవాలే కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన మహారాష్ట్రకు చెందిన నేత.