
కేంద్ర మంత్రి , నటుడు సురేష్ గోపి కుమారుడు మాధవ్ సురేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరువనంతపురంలోని సస్థమంగళం వద్ద కాంగ్రెస్ నాయకుడు వినోద్ కృష్ణతో జరిగిన గొడవ కారణంగా ఈ పరిమాణం చోటుచేసుకుంది. ఈ ఘటన గురువారం రాత్రి జరిగింది. చిన్ని వివాదంగా మొదలై చివరికి పోలీస్ అరెస్ట్ కు దారితీసింది. ఇప్పుడు ఇది కేరళ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
రాత్రి 11 గంటల సమయంలో వెళ్ళయంబళం వైపు వెళ్తున్న మాధవ్ కారు.. యూటర్న్ తీసుకుంటున్న వినోద్ కృష్ణ కారు ఢీకొట్టడంతో ఈ వివాదం మొదలైనట్లు సమాచారం. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహం చెందిన మాధవ్, తన కారుతో వినోద్ వాహనానికి అడ్డంగా నిలిపారు. దీంతో ఇద్దరూ ఆగి రోడ్డు పక్కన తీవ్ర వాగ్వాదానికి దిగారు..
►ALSO READ | 'SSMB29' టైటిల్ రివీల్.. జేమ్స్ కామెరూన్ చేతుల మీదుగా గ్లోబల్ సర్ప్రైజ్!
దీంతో రద్దీగా ఉండే ఈ జంక్షన్ లో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మాధవ్ మద్యం మత్తులో ఉన్నారని వినోద్ అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో పోలీసు అతనికి బ్రీత్ లైజర్ టెస్ట్ నిర్వహించారు. అయితే మాధవ్ మద్యం సేవించలేదని నిర్ధారణ అయింది.
అనంతరం ఇరువర్గాలకు పోలీసు అధికారులు సర్దిచెప్పడంతో వివాదం ముగిసింది.. ఎలాంటి ఫిర్యాదు చేయకుండా కేసును విరమించుకోవాలని వినోద్ ను పోలీసులు కోరారు. దీంతో ఈ వ్యవహారాన్ని కొనసాగించడం తనకు ఇష్టం లేదని లిఖితపూర్వకంగా వాంగ్మూలం సమర్పించారు. అనంతరం మాధవ్ సరేష్ ను పోలీసులు విడుదల చేశారు.