అటెంప్ట్​ మర్డర్​ కేసులో ఎమ్మెల్యే నితీష్ రాణే కు బెయిల్ నిరాకరణ

అటెంప్ట్​ మర్డర్​ కేసులో ఎమ్మెల్యే నితీష్ రాణే కు బెయిల్ నిరాకరణ

అటెంప్ట్​ మర్డర్​ కేసులో కేంద్ర మంత్రి కుమారుడు, బీజేపీ ఎమ్మెల్యే నితీష్ రాణే  ఇవాళ(బుధవారం) మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా కోర్టులో లొంగిపోయారు. కేంద్ర మంత్రి నారాయణ్‌ రాణే కుమారుడు అయిన నితీష్‌ రాణేను జ్యుడీషియల్‌ కస్టడీకి పంపినట్లు స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ప్రదీప్‌ ఘరత్‌ తెలిపారు. అంతకుముందు రోజు నితీష్ రాణే బాంబే హైకోర్టు నుండి తన బెయిల్ పిటిషన్‌ను వాపస్​ తీసుకున్నారు.  లొంగిపోయి విచారణ ఎదుర్కోవాలని  భావిస్తున్నట్లు అతని లాయర్ తెలిపారు. అయితే జిల్లా,  అదనపు సెషన్స్ జడ్జి  నిన్న(మంగళవారం) అతని బెయిల్ పిటిషన్​ని తిరస్కరించడం కూడా ఓ కారణంగా తెలుస్తోంది.  

హత్యాయత్నం కేసు దర్యాప్తు అసంపూర్తిగా ఉన్నందున నితీష్ రాణేను కస్టడీలో ఉంచడం అవసరమని కోర్టు తెలిపింది. సింధుదుర్గ్ జిల్లా కో-ఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల ప్రచారంలో శివసేన కార్యకర్త సంతోష్ పరాబ్‌పై దాడికి సంబంధించి ఈ కేసు నమోదైంది.

మరిన్ని వార్తల కోసం..

వడ్డీ రేటును తగ్గించిన పోస్ట్ ఆఫీసు