దేశ అభివృద్ధిలో రైతుల పాత్రే కీలకం

దేశ అభివృద్ధిలో రైతుల పాత్రే కీలకం

న్యూఢిల్లీ: భారత స్వాతంత్ర్యోద్యమంలో కీలక ఘటన అయిన చౌరీచౌరా సెలబ్రేషన్స్‌‌ను ఉత్తర్ ప్రదేశ్‌‌లోని గోరఖ్‌పూర్ జిల్లాలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఆరంభించారు. చౌరీ చౌరా ఘటనకు గుర్తుగా 1922, ఫిబ్రవరి, 4వ తేదీతో ఉన్న ప్రత్యేక స్టాంపు‌‌ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మోడీ ప్రసంగించారు. చౌరీచౌరాలో అమరులైన వీరుల గురించి పెద్దగా మాట్లాడుకోకపోవడం దురదృష్టకరమన్నారు. వాళ్లకు చరిత్ర పుస్తకాల్లో చోటు దక్కనప్పటికీ.. వారి రక్తం ఈ మట్టిలో నిలిచి మనలో స్ఫూర్తి నింపుతోందన్నారు.

కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు నిరసనలు చేస్తున్న నేపథ్యంలో మోడీ అన్నదాతల గురించి తన ప్రసంగంలో మాట్లాడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ‘దేశ అభివృద్ధిలో రైతుల కృషి ఎంతో ఉంది. చౌరీ చౌరా ఉద్యమంలో కూడా వారి పాత్ర చాలా ఉంది. అన్నదాతలు తమపై తాము ఆధారపడేలా ఈ ఆరేండ్లలో ఎన్నో చర్యలు చేప్టటాం. అందుకే కరోనా టైమ్‌‌లోనూ వ్యవసాయ రంగం మెరుగుదల నమోదు చేసింది’ అని మోడీ చెప్పారు.