వణికించే చలిలో అంగీల్లేకుండా నిరసన

వణికించే చలిలో అంగీల్లేకుండా నిరసన

జామియా మిలియా వర్సిటీ గేటు ముందు స్టూడెంట్ల నిరసన

న్యూఢిల్లీ: ఢిల్లీ వీధుల్లో జామియా మిలియా యూనివర్సిటీ స్టూడెంట్లు కదం తొక్కారు. జాతీయ జెండా చేతబట్టి.. కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. యూనివర్సిటీ గేటు ముందు నిలబడి ఆర్ధనగ్న ప్రదర్శనలు ఇచ్చారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు ఇచ్చారు. వీరికి స్థానికులు కూడా మద్దతు తెలిపారు. ఆందోళన దృశ్యాలను కొందరు స్టూడెంట్లు ట్విట్టర్, ఫేస్​బుక్, ఇతర సోషల్ మీడియాల్లో లైవ్ స్ర్టీమింగ్ ఇచ్చారు.సోమవారం ఉదయాన్నే యూనివర్సిటీ ఎంట్రన్స్ వద్దకు చేరుకుని షర్టులు విప్పేసి నిరసన చేపట్టారు. చలి వణికిస్తున్నా తమ ఆందోళన కొనసాగించారు. వీరికి స్థానికులు, విద్యార్థినులు మద్దతు పలికారు. మానవహారంగా ఏర్పడిన స్టూడెంట్స్‌ స్లోగన్స్ ఇచ్చారు.

‘ఏఎంయూ’ గొడవలో 21 మంది అరెస్టు

అలీగఢ్: పోలీసులకు, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) స్టూడెంట్లకు జరిగిన గొడవకు సంబంధించి 21 మందిని అరెస్టు చేశారు. మరో 56 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. యూనివర్సిటీలోని అన్ని హాస్టళ్లనూ స్టూడెంట్లు వెకేట్ చేసి వెళ్లాలని అధికారులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Universities erupt in solidarity with Jamia students over protests against CAB