భూమి పుట్టినప్పుడు ఇలా ఉంది…

భూమి పుట్టినప్పుడు ఇలా ఉంది…

ఏందీ.. మన సూర్యుడి మీద గిన్ని మచ్చలు కన్పిస్తున్నయి? అప్పట్లో చానా సల్లగుండెటోడా? ఏందీ? అనుకుంటున్నారా! ఈ ఊహాచిత్రం సూర్యుడిది కాదు.. మన భూమిదే! సూర్యుడు 460 కోట్ల ఏండ్ల కింద పుట్టిండని, ఆ తర్వాత సూర్యుడి చుట్టూ మిగిలిపోయిన కాస్మిక్ డస్ట్, గ్యాసెస్ తో భూమితో సహా గ్రహాలన్నీ పుట్టాయన్నది తెలిసిందే. అయితే, సూర్యుడు పుట్టినంక 5 కోట్ల ఏళ్లకే ఇతర గ్రహాలను ఢీకొడుతూ.. భూమి ఒక షేపులోకి వచ్చిందని ఇప్పటివరకున్న థియరీ. కానీ.. ఇది తప్పని, సూర్యుడి చుట్టూ మిగిలిన డస్ట్ వేగంగా పోగుపడుతూ.. జస్ట్ 50 లక్షల ఏళ్లకే భూమి ఒక ఆకారం పొందిందని యూనివర్సిటీ ఆఫ్​ కోపెన్ హెగన్ సైంటిస్టులు అంటున్నారు. భూమిపై రాలిన పలు ఉల్కలపై చేసిన రీసెర్చ్ లో ఈ విషయం తెలిసిందని వెల్లడించారు. భూమి ఏర్పడిన తొలినాళ్లలో ఇట్ల ఉండి ఉంటుందని చెప్తూ ఈ ఊహాచిత్రాన్ని విడుదల చేశారు.